రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ హాఫ్ విఫలం
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:32 AM
తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ హాఫ్‌లో పూర్తిగా విఫలమైంద ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫస్ట్ హాఫ్‌లో పూర్తిగా విఫలమైంద ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ ఆర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవ న్‌లో మన బలం - మన బలగం కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం డిజిటల్ సభ్యత్వ నమోదు, బీఎల్ ఏలకు అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యర్తలకు దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నిరంగాల్లో వైఫల్యం చెందారని కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలలో అసంతృప్తి ఉందని ఆరోపించారు. సినిమా ఫస్ట్‌హాఫ్ డిజాస్టర్ అయినపుడు సెంకడ్ హాఫ్ పట్ల కూడా ఎలాంటి ఆశలు ఉండవని కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కూడా అలాగే ఉందన్నారు. అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయని ఇప్పుడు అలాంటి పరిస్థితినే ప్రజలు ఎదుర్కొంటు న్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు, ఎరువుల తిప్పలు, ధాన్యం కొనుగోలు సంక్షోభాలను తీసుకొచ్చిందన్నారు. ఆదే విధంగా తరుగు పేరుతో రైతులను మోసం చేస్తుందని ఎరువుల దుకాణా వద్ద రైతులు మళ్లీ పాత రోజులు మాదిరిగా క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొను గోలు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీకి మాత్రం సంచులలో డబ్బులు వెళ్తున్నాయని తెలంగాణ డబ్బును దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని భారీ అప్పు ల్లోకి నెట్టారన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్‌పై రాసిచ్చిన హామీలను ఇప్పటికి ఎం దుకు అమలుచేయలేదని దీనిపై సమాధానం చెప్పాలని డిమాం డ్ చేశారు. హిట్లర్ తనకు స్ఫూర్తి అని చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి ప్రజలు ఇంకేం ఆశించలేరని రేవంత్‌రెడ్డి డైలాగులకు ఎక్కువ పనికి తక్కువ అని ఎద్దేవా చేశారు. మీనాక్షి నాటరాజన్‌కు అవమానం జరిగేలా వ్యవహరించింది రేవంత్‌రెడ్డే నని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు పాలు ఇచ్చే బర్రెను వది లి తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా కాంగ్రెస్‌ను ఎన్నుకున్నా రని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15లక్షల పెళ్లిళ్లు, జిల్లాకో మెడికల్ కళాశాల, గురుకులా లను తీసుకొచ్చారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అద్భుత మైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని రేవంత్‌రెడ్డి తెలంగా ణకు చేసిందేమిటో చెప్పాలని సవాల్‌విసిరారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న మొన్నటి మున్సిపల్ ఎన్నిక లలో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌పార్టీ సత్తాచాటిందన్నారు. అధికారం లేకున్న ప్రజల ఆధరణ బీఆర్‌ఎస్ పార్టీపై ఏమాత్రం తగ్గలేదన్నా రు. లక్షల మంది పార్టీ కార్యకర్తలు పార్టీ వెంట నిలబడ్డారని కార్యకర్తలే పార్టీకీ అసలైన బలం అన్నారు. నాకు జన్మనిచ్చింది శోభమ్మ అయితే రాజకీయంగా పునర్జన్మను ఇచ్చింది మాత్రం సిరిసిల్ల ప్రజలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్, నియోజకవర్గం ఇంచార్జి తుల ఉమ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగనావు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతనిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.