Share News

భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:35 AM

గ్రామాల్లో భూవివాదాల పరి ష్కారానికే రీ సర్వే చేపట్టినట్లు అద నపు కలెక్టర్‌ బీఎస్‌ లత తెలిపారు.

భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత

పెగడపల్లి, జూలై 18 (ఆంధ్ర జ్యోతి): గ్రామాల్లో భూవివాదాల పరి ష్కారానికే రీ సర్వే చేపట్టినట్లు అద నపు కలెక్టర్‌ బీఎస్‌ లత తెలిపారు. ప్రజలు భూ రీసర్వేకు సహకరించాలని ఆమె కోరారు. పెగడపల్లి మండలం లోని నార్సింహునిపేట గ్రామంలో శని వారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి భూ రీసర్వే గ్రామ సభ నిర్వ హించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నార్సింహునిపేట గ్రామాన్ని భూభారతి భూ రీసర్వేకు పైలట్‌ ప్రాజెక్టు గా ఎంపిక చేశామన్నారు. రీ సర్వే వల్ల భూయజమా నులకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. భూ ముల హద్దులు స్పష్టంగా నమోదవడంతో భూ వివాదాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు. రెవెన్యూ అధికారులు భూకొలతలు నిర్వహించేటపుడు సంబంధిత భూయజమానులతో పాటు చుట్టు ప క్కల భూయజమానులు సైతం హాజరై హద్దుల ఏర్పాటుకు సహకరించాలాన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ నిజాముద్దీన్‌, ఎంపీడీవో ప్రేమ్‌ సాగర్‌ రావు, మార్కెట్‌ చైర్మన్‌ బుర్ర రాములు గౌడ్‌, గిర్దా వర్‌ శ్రీనివస్‌, పంచాయతీ కార్యదర్శి లావణ్య, జిపివో పద్మ, మండల నాయకులు సంధి మల్లారెడ్డి, ఒరుగల శ్రీనివాస్‌, కిషన్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:35 AM