వరి సాగుపై ఆంక్షలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:40 AM
యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులకు గట్టిగా సూచిస్తున్నది. ఎల్‌నినో కారణంగా సాగు నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సి ఉన్నందున వరిసాగు చేయకపోవడం ఉత్తమమని వ్యవసాయశాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది.
- అనధికార క్రాప్ హాలీడే విధించిన ప్రభుత్వం
- విత్తనాల కొనుగోలుపై ఆంక్షలు
- సాగు మూడోవంతుకు పడిపోయే అవకాశం
‘ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతున్నది. నాకు వరి మాత్రమే పండే అవకాశాలున్నందున నా సొంత నిర్ణయంతో వరి సాగుకు నిర్ణయం తీసుకున్నాను.. కరెంటు కారణంగా కానీ నీరందకగానీ.. మరే ఇతర కారణాలతో కానీ పంట రాని పక్షంలో డీలర్లకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేదు.. ఇది నా ఇష్ట పూర్వకంగా నేను తీసుకున్న నిర్ణయం.. కావున నాకు విత్తనం అమ్మగలరు’..
వరి విత్తనాలు కావాలంటే రైతులు సమర్పించాల్సిన సెల్ఫ్ డిక్లరేషన.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులకు గట్టిగా సూచిస్తున్నది. ఎల్‌నినో కారణంగా సాగు నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సి ఉన్నందున వరిసాగు చేయకపోవడం ఉత్తమమని వ్యవసాయశాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. అధికారికంగా ఇప్పటికైతే క్రాప్‌హాలిడే ప్రకటించక పోయినా అనధికారికంగా పరోక్షంగా వరి సాగుపై నిషేధం విధించినట్లే చెప్పవచ్చు.
ఫ సెల్ఫ్ డిక్లరేషన ఇస్తేనే విత్తనాలు
రైతులకు వరి విత్తనాలను విక్రయించవద్దని సీడ్ వ్యాపారులను, ఇతర వ్యాపారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా రైతు తప్పనిసరిగా వరి విత్తనాలు కావాలంటే విత్తన వ్యాపారికి రైతు ఒప్పంద పత్రం రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన ఫారం పేరిట ప్రభుత్వం ఒక పత్రాన్ని విత్తన వ్యాపారులకు పంపించింది. రైతు ఆ సెల్ఫ్ డిక్లరేషన ఫారంపై సంతకం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఫారంలో రైతు పేరు, తండ్రి పేరు, సెల్, ఆధార్ నంబరు, గ్రామం, మండలం, జిల్లా వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తిచేస్తేనే రైతుకు విత్తనాలు విక్రయిస్తారు. వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణలోనే విత్తన వ్యాపారులు విత్తనాలను అమ్మాల్సి ఉంటుంది. ప్రతి యాసంగిలో జిల్లాలో సాధారణంగా 2.60 లక్షల ఎకరాల నుంచి 2.75 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తారు. ప్రస్తుతం ఇది మూడో వంతుకు పడిపోయే అవకాశముంది. బావులు, బోరుబావుల కింద ఒకటి రెండు ఎకరాల్లో మాత్రమే ఇంటి అవసరాల కోసం రైతులు వరి సాగు చేసుకునే అవకాశాలున్నాయి.
ఫ తాగునీటికే ప్రాధాన్యం
ఎల్ నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రానున్నరోజుల్లో తాగునీరు, విద్యుత, సాగు నీటి అవసరాలకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ యాసంగి సీజనలో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. వ్యవసాయశాఖతోపాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న గడ్డి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ప్రభుత్వం సూచించింది. ఆయిల్ పామ్ తోటల సాగును కూడా ప్రోత్సహించాలని నిర్ణయించింది. అవసరమైన ప్రాంతాల్లో డ్రిఫ్, స్ర్పింక్లర్లను వినియోగించేలా చూడాలని, నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, పంటల అవసరాలను రైతులకు అవగాహన కల్పించి వరి సాగు చేసి నష్టపోకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాబోయే ఎనిమిది నెలలకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది.