Share News

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు స్పందన

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:28 PM

జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలకు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు స్పందన
పరుగు పోటీలో పాల్గొంటున్న బాలికలు

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు విశేష స్పందన లభించింది. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీలకు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలను కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ అంజయ్య సోమవారం ఉదయం ప్రారంభించారు. జూనియర్‌ విభాగంలో ప్రతిభచాటిన క్రీడాకారులను అక్టోబరె 11 నుంచి ఆసిఫాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేశారు. సబ్‌ జూనియర్‌ అండర్‌-14 విభాగంలో హైదరాబాద్‌లో జరగనున్న 20వ జాతీయస్థాయి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి నాగరాజుగౌడ్‌ పతకాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్‌, జనగాం సుమన్‌ కళ్యాణ్‌, సభ్యులు బెజ్జంకి రాజగోపాల్‌, సత్తినేని రమేష్‌, టి హరికిషన్‌, ఎం చంద్రశేఖర్‌, క్రీడాశాఖ కోచ్‌ పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:28 PM