Share News

గ్రామాల సరిహద్దు సమస్య పరిష్కరించండి

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:41 AM

చాలా కాలంగా ఉన్న తమ గ్రామాల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కోరు తూ జగిత్యాల మండ లం గొల్లపల్లి, వెల్దుర్తి గ్రామాల సర్పంచలు, గ్రామస్తులు జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను ఆదివారం కలిసి విన్నవించారు.

గ్రామాల సరిహద్దు సమస్య పరిష్కరించండి
వెల్దుర్తి, గొల్లపెల్లి గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

- ఎమ్మెల్యేకు గొల్లపల్లి, వెల్దుర్తి సర్పంచలు, గ్రామస్తుల వినతి

జగిత్యాల అర్బన, మార్చి 29 (ఆంధ్రజ్యో తి): చాలా కాలంగా ఉన్న తమ గ్రామాల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కోరు తూ జగిత్యాల మండ లం గొల్లపల్లి, వెల్దుర్తి గ్రామాల సర్పంచలు, గ్రామస్తులు జగిత్యా ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను ఆదివారం కలిసి విన్నవించారు. వెల్దుర్తి, గొల్లపల్లి గ్రామ శివారులోని వంజరిపల్లె గ్రామం సరిహద్దు విషయంలో సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు తెలిపి గ్రామాల మధ్య వివాదా న్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

శరవేగంగా జగిత్యాల అభివృద్ధి

జగిత్యాల టౌన: శివారు ప్రాంతాలను కలపడంతో జగిత్యాల పట్టణం శరవేగంగా అభివృద్ది చెందుతున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని ఆరో వార్డులో 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివారు ప్రాంతాలను కలపడం వల్ల జగిత్యాల పట్టణం శరవేగంగా విస్తరిం చడంతో పాటు అంతేవేగంగా అభివృద్ధి చెందు తున్నదని అన్నారు. కార్యక్రమంలో మున్సిప ల్‌ చైర్మన సమీండ్ల వాణి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ జడ్పీటీసీ ముస్కు ఎల్లారెడ్డి, చీటి లక్ష్మీనా రాయణ, క్యాదసు నాగయ్య, డీఈ ఆనంద్‌, ఏఈ అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 12:41 AM