Share News

భూ భారతి రీ సర్వేతో వివాదాల పరిష్కారం

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:51 PM

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని హుజూరాబాద్‌ ఆర్డీవో జలకుమారి అన్నారు.

భూ భారతి రీ సర్వేతో వివాదాల పరిష్కారం
శంకరపట్నం మండలం ధర్మారంలో మాట్లాడుతున్న ఆర్డీవో జల కుమారి

శంకరపట్నం, జూలై 22 (ఆంధ్రజ్యోతి): భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి రీ సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని హుజూరాబాద్‌ ఆర్డీవో జలకుమారి అన్నారు. శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో భూ భారతి రీ సర్వేపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ శంకరపట్నం మండలంలో ధర్మారం గ్రామం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధర్మారం గ్రామంలో భూ భారతి రీ సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనిత, ఇన్‌చార్జి తహసీల్దార్‌ సాయికృష్ణ, సర్పంచ్‌ చింతిరెడ్డి పద్మ, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, సహకార సంఘాల చైర్మన్లు బసవయ్య, మహేష్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2026 | 11:52 PM