Share News

డంపింగ్‌ యార్డును రద్దు చేయాలని మంత్రికి వినతి

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:49 PM

హుజూరాబాద్‌ మండలంలోని సిర్సపల్లి-రంగాపూర్‌ గ్రామాల మధ్య నిర్మించనున్న డంపింగ్‌యార్డును రద్దు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు.

డంపింగ్‌ యార్డును రద్దు చేయాలని మంత్రికి వినతి
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేస్తున్న అఖిలపక్ష నాయకులు

హుజూరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ మండలంలోని సిర్సపల్లి-రంగాపూర్‌ గ్రామాల మధ్య నిర్మించనున్న డంపింగ్‌యార్డును రద్దు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అఖిలపక్ష నాయకులు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం ఇల్లందకుంటలోని సీతారాముల కల్యాణానికి వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అఖిలపక్ష నాయకులు హుజూరాబాద్‌లో కలిసి విన్నపించారు. స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ డంపింగ్‌ యార్డు విషయాన్ని నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యకు పరిష్కారం చూపెడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రొంటాల సుహానిసి, అఖిలపక్ష నాయకులు కట్కూరి మల్లారెడ్డి, బండ శ్రీనివాస్‌, పల్కల ఈశ్వర్‌రెడ్డి, వర్ధినేని రవీందర్‌రావు, చందుపట్ల జనార్ధన్‌, కొలిపాక సమ్మయ్య, వేల్పుల రత్నం, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:49 PM