గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:45 AM
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు.
అదనపు కలెక్టర్ బీఎస్ లత
జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లోని గణతంత్ర వేడుకల ఏర్పాట్లను శనివారం అదనపు కలెక్టర్ బీఎస్ లత పరిశీలించారు. వేదిక నిర్మాణం, పతాకావిష్కరణ స్థలం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణం, స్టాల్స్, పార్కింగ్, భద్రతా చర్యలు వంటి అంశాలను సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా జరిగే కార్యక్రమాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీఏ రఘువరన్ డీపీఆర్వో నరేష్, మున్సిపల్ కమిషనర్ స్పందన, కలెక్టరేట్ ఏవో హకీం, ఏపీడీ సునీత, తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు.