Share News

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:45 AM

జిల్లాలోని సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాల్టీలల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌,జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ కోరారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి

సిరిసిల్ల అర్బన్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని సిరిసిల్ల, వేముల వాడ మున్సిపాల్టీలల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌,జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ కోరారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్‌ శ్రీని వాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహి స్తామని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ కార్యాలయాల సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌, హెల్ప్‌లైన్‌, ఫిర్యాదుల కేంద్రం, మీడియాసెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. 18002331495నంబర్‌ అందుబాటులో ఉంటుందని వివరించారు. పోటీచేసే అభ్యర్థులు నూతన బ్యాంక్‌ ఖాతా ఓపెన్‌ చేయాలని, నామినేషన్‌ పత్రాలు పూర్తిగా నింపాలని, తమ పూర్తి సమాచారాన్ని నింపాలని తెలిపా రు. ప్రచార వాహనాలు, లౌడ్‌ స్పీకర్‌, సభలు, ర్యాలీలు, పబ్లిక్‌ మీటింగులకు మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచిం చారు. పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించి వివ రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. నామినేష న్లు ఉదయం10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నెల 30వ తేదీ వరకు తీసుకుంటారని వెల్లడించారు. ఆయా మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపాల్టీల్లో ఏర్పాటు చేసి న కేంద్రాల్లో నామినేషన్‌ ఫారాలు, ఇతర అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. అభ్యర్థులు తప్పనిసరిగా నూతన బ్యాంక్‌ లేదా పోస్ట్‌ ఆఫీసుల్లో ఖాతాలు తెరవాలని సూచించారు. వ్యయానికి సంబంధించి వివరాలను సహాయ ఎన్నికల వ్యయఅధికారులకు తెలియజేయాలని పేర్కొ న్నారు. నామినేషన్‌ కేంద్రాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి, అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఎన్నికలకు 48 గంటల ముందు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు వెళ్లాలని స్పష్టం చేశారు. కరపత్రా లపై ప్రింట్‌ చేసిన వారి వివరాలు ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నిక ల అధికారి గరిమ అగ్రవాల్‌ తెలిపారు. జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధార ణ పరిశీలకులు డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పైవ్రేట్‌ ఆస్తులపై ప్రచా రం వివరాలు రాస్తే సంబంధిత ఇంటి యజమాని అనుమతి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి రాతలు చేయవద్దని స్పష్టం చే శారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రచారం చేయాలని సూచిం చారు. ఈ సమావేశంలో నోడల్‌ అధికారులు గీత, నవీన్‌కుమార్‌, ప్రవీణ్‌, అన్సారీ, ఏంఏ భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2026 | 12:45 AM