Share News

ప్రజాస్పందనతో కొత్త ఉత్సాహం

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:48 AM

సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల స్పందనతో కొత్త ఉత్సాహం ఇచ్చారని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలి పారు.

ప్రజాస్పందనతో కొత్త ఉత్సాహం

సిరిసిల్ల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల స్పందనతో కొత్త ఉత్సాహం ఇచ్చారని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ తెలి పారు. గురువారం సిరిసిల్లలో ఇందిరమ్మ చీరల బిల్లులు రూ.141.48 కోట్లు విడుదల చేయడంపై పాలిస్టర్‌, మ్యాక్స్‌ అసోసియేషన్‌, చేనేత వస్త్ర వ్యాపార, ఆసాముల సంఘం నాయకులు కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన సందర్భంగా సిరిసిల్లలో ప్రజలు చూపిన స్పందన ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో సిరిసిల్ల చుట్టుపక్కల రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. వేములవాడ నుంచి కోదురుపాక వైపు వరకు రహ దారులపై ట్రాఫిక్‌ నిలిచిపోయిందని, కొన్ని ప్రాంతా ల్లో ఐదారు కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ కనిపించిందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సిరిసిల్ల సభపై ఆసక్తి నెలకొందని, ముఖ్యమంత్రి సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు ముఖ్యమంత్రి సభకు హాజరయ్యారని తెలిపారు. సభలో పాల్గొనడంతో పాటు ముఖ్యమంత్రి పాద యాత్రలో నడవాలనే ఆకాంక్షతో అనేక మంది అభిమానంతో తరలివచ్చారని పేర్కొన్నారు. జిల్లాతో పాటు కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, నిజామా బాద్‌ జిల్లాలు, బాల్కొండ, వేములవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞ తలు తెలిపారు. సభకు ప్రజలను ఆహ్వానించేం దుకు గ్రామాల్లో కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. సభకు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు క్షేమంగా చేర్చే వరకు బాధ్యతగా వ్యవహరించిన నాయకత్వాన్ని అభినందించారు.గ్రామస్థాయి నుంచి మండల, పట్టణ, నియోజకవర్గ, జిల్లాస్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయడం వల్లే సభ విజయవంతమైందని పేర్కొన్నారు.

నేతన్నలు, కార్మికుల సహకారం మరువలేనిది

సిరిసిల్ల అంటేనే నేతన్నల కష్టం, శ్రమ, ఆత్మగౌ రవానికి ప్రతీక, ముఖ్యమంత్రి సభ విజయవంతా నికి నేతన్నలు అందించిన సహకారం ప్రత్యేకమని ఆది శ్రీనివాస్‌ అన్నారు. పవర్‌లూమ్స్‌ సంఘాల ప్రతినిధులు, ఆసాముల సంఘం నాయకులు, కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో సమావే శమై సభకు సంబంధించిన ఏర్పాట్లు, సహకారంపై చర్చించినట్లు తెలిపారు. నేతన్నలు, కార్మికులు, సం ఘాల ప్రతినిధులు చూపిన ఐక్యత, సహకారం సభ విజ యవంతంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువ త, నేతన్నలు, అధికారులు, అనధికారులు సభ కోసం శ్రమించారని తెలిపారు. పట్టణ, జిల్లా కాంగ్రెస్‌ నాయకత్వం సమన్వయంతో పనిచేసిందని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి ముందుకు సాగారని అన్నారు. సభకు సుమారు లక్షన్నర మందిని ఆహ్వానించగా, అంత కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని పేర్కొన్నారు. సభకు వచ్చిన ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నాయకులు, కార్యకర్తలు చూపిన శ్రద్ధ అభినందనీయమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ ప్రజల్లో కొత్త ఉత్సా హాన్ని నింపిందని అన్నారు. సభ విజయవంతంతో వచ్చిన ప్రోత్సాహాన్ని ప్రజా సమస్యల పరిష్కా రానికి ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ, నేతన్నలు, కార్మికులు, రైతులు, ఇతర వర్గాల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ గౌడ్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అఽధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్‌, గౌరవ అధ్యక్షుడు గోవిందు రవి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవరాజు, ఆంకాలపు రవి, విష్ణు, మండల సత్యం గౌడ రాజు, సామల అశోక్‌ తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:48 AM