Share News

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:14 AM

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తు న్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు.

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తు న్న భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదలపై డీజీపీ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువా రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా, కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ పలు జిల్లాల్లో అతిభారీ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, వరదలపై ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా వారి కేంద్ర కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లు 24గంటలు పని చేయాలన్నారు. జిల్లాల వారీగా కురిసిన వర్షా లు, డ్యాంలలో చేరిన నీరు, దెబ్బతిన్న, రోడ్లు వంతెనలు, చేపట్టిన సహా య చర్యల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు సమాచారం అందితే తక్షణమే స్పందించాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు టామ్‌ టామ్‌ చేయాలన్నారు. పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని, వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతా లు, చెరువులు, కుంటలు, నదుల పరిసర ప్రాంతాల్లోకి పశువులకాపరులు, మత్స్యకారులు, ఇతరులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీజీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదల వల్ల ప్రజలు ఎవరికి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ వివిధ శాఖల అధికారులతో సమ న్వయంతో పనిచేస్తుందని వివరించారు. పోలీసు శాఖ తరపున అవసర మైన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అద నపు కలెక్టర్‌ గడ్డం, డీఆర్‌వో జయశ్రీ, జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, సీపీవో శ్రీని వాసాచారి, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:14 AM