కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:24 AM
ఎల్‌నినో ప్రభావంతో ఎర్పడిన కరువు ప్రాం తాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
ఇల్లంతకుంట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఎల్‌నినో ప్రభావంతో ఎర్పడిన కరువు ప్రాం తాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మండలం లోని కందికట్కూర్ గ్రామంలో బుధవారం ఎండిన వరి చేనును పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫ ల్యాల వల్లనే వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని ఎల్‌నినో ఏర్పడిందన్నారు. మెట్టప్రాం తమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం అవగాహన సమావేశాలు నిర్వ హిస్తున్నా ఇది సరిపోదని అఖిలపక్షాన్ని తీసు కొని వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని విన్న వించాలన్నారు. గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారే అవకాశం ఉన్నందున అందరికి కూలీ పనులు లభించేలా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కౌలు రైతుల ను పట్టించుకునే వారు కరవయ్యారని విమ ర్శించారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు ఎండిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం అర్థంచేసుకోవాలన్నారు. పక్కనే మధ్య మానేరు ఉన్నా పంటలు ఎండి పోవడం బాధాకరం అని అన్నారు. అనంతరం తాళ్ళపెల్లి గ్రామంలో సీనియర్ నాయకు డు కామ్రేడ్ సావన పెల్లి మల్లేశం కు టుంబాన్ని పరామ ర్శించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి నా నిరంతరం ప్రజ ల సమస్యలపై పో రాటం చేశాడన్నారు. దేశంలో ఎర్రజెండా కు వందేళ్లు పూర్త య్యాయని, అనేక పార్టీలు కనుమరుగైనా ఎర్రజెండా మత్రం పేదలపక్షానే కొనసాగుతుందన్నారు. వెంకట్రా వుపల్లె, గొల్లపల్లె గ్రామాల మధ్యలో సరిహద్దు వివాదాన్ని ప్రభుత్వం పరిష్కరించాలని కోరా రు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షు డు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ జిల్లా కార్యద ర్శి మంద సుదర్శన్, జిల్లా కార్యవర్గ స భ్యులు కడారి రాములు, మంద అనీల్‌కుమార్, మండ ల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి ఉన్నారు.