Share News

క్రీడలతో మానసికోల్లాసం

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:47 AM

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
బ్యాటింగ్‌ చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జగిత్యాల టౌన్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళశాల మైదానంలో శనివారం జరిగిన న్యాయవాదుల క్రికెట్‌ పోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి నారాయణ, రెండవ అదనపు జూడిషియల్‌ మేజిస్ర్టేట్‌ లావణ్య, కోరుట్ల జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ పావని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాచకొండ శ్రీరామలు, కార్యదర్శి మారుతి, సీనియర్‌ న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 12:47 AM