Share News

సిఫారసులు వెంటనే అమలుచేయాలి

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:23 AM

ప్రభుత్వం వెంట నే కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులు అమలు చేయా లని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌ అన్నారు.

సిఫారసులు వెంటనే అమలుచేయాలి

సిరిసిల్ల టౌన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం వెంట నే కోనేరు రంగారావు భూకమిటీ సిఫారసులు అమలు చేయా లని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్మిక భవనంలో డీహెచ్‌పీఎస్‌ నాయకుడు గుండ్ర రవీంద్ర అధ్యక్షతన జిల్లా రెండో మహాసభ జరిగింది. ముందుగా కార్మిక భవనం ఎదుట డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్లపల్లి లక్ష్మణ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంత రం జరిగిన మహాసభలో ముఖ్యఅతిథి మారుపాక అనిల్‌కుమా ర్‌ మాట్లాడారు. దళితులతో పాటు భూమిలేని నిరుపేదల భూ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు భూ కమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూ ములు ఆక్రమణలకు గురవుతున్నాయని, అసైన్డ్‌ భూములు అన్యాయంగా ఇతరుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆందోళనవ్యక్తం చేశారు. భూకమిటీ స్పష్టంగా సూచించినట్లుగా భూముల రక్షణ కు కఠిన చర్యలు తీసుకోవడం భూమిలేని దళిత కుటుంబాలకు సాగు భూమి పంపిణీ చేయడం అత్యవసరం అని అన్నారు. అసైన్‌ భూముల ఆక్రమణను వెంటనే తొలగించి భూమిలేని దళితులకు సాగుభూమిగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను పూర్తిగా అమలుచే యాలని భూరికార్డులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. దళితులు జీవనోపాధి, ఆర్థిక స్వావలంబన భూమితోనే సాధ్య మవుతుందని ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆం దోళనలను చేపడతామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద వేల కోట్ల రూపాయలు కేటాయిస్తు న్నప్పటికీ ఆ నిధులు నిజంగా దళితులు, ఆదివాసీల అభివృద్ధికే ఖర్చవుతున్నాయా లేదా అన్న విషయంపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. సబ్‌ప్లాన్‌ చట్టం ప్రకారం దళితు లు, ఆదివాసీల జనాభా శాతానికి అనుగుణంగా నిధులు కేటా యించి ఆ వర్గాల విద్యా, ఉపాధి, ఆరోగ్యం, గృహాలు, భూమి పంపిణీ కోసం ఖర్చు చేయాలన్నారు. కానీ అనేక శాఖలు ఈ నిధులను ఇతర పథకాల కింద చూపించడం లేదా ఖర్చు చేయకుండా నిల్వచేయడం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తు న్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద కేటాయించిన మొత్తం నిధులు ఖర్చు చేసిన, మిగిలిన నిధులు అవి ఏ పథకాపై ఖర్చు అయ్యాయన్న వివరా లతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సబ్‌ప్లాన్‌ నిధులు ఇతర అవసరాలకు మళ్లింపులు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలన్నారు. దళితు లు, ఆదివాసుల అభివృద్ధి కోసం ఈ నిధులను పూర్తి గా విని యోగించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనలను చేపడతామన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, జిల్లా నాయకులు గుంటి వేణు, కదిరి రాములు, పవిత్ర, ప్రభా కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 19 , 2026 | 12:23 AM