Share News

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు..

ABN , Publish Date - Aug 05 , 2026 | 11:46 PM

యువజన కాంగ్రెస్‌లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి రోషిణి జైశ్వాల్‌ అన్నారు.

కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు..
సమావేశంలో మాట్లాడుతున్న యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శ్జి రోషిణి జైశ్వాల్‌

కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): యువజన కాంగ్రెస్‌లో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి రోషిణి జైశ్వాల్‌ అన్నారు. జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ సమీక్ష సమావేశం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోషిణి జైశ్వాల్‌ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్‌ను బలోపేతం చేసే విధంగా ప్రతి యువజన కాంగ్రెస్‌ కార్యకర్త, నాయకులు కృషి చేయాలన్నారు. యువత సమస్యల పరిష్కారానికి కార్యకర్తలు కృషి చేసి, వారి మద్దతును కూడగట్టాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దీపక్‌ ప్రజ్ఞ, థామస్‌, కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి తేజస్విని, జోసెఫ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం వాసు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌, కృప సాగర్‌, నగర అధ్యక్షుడు విశాల్‌, ఫహద్‌, శ్రీకాంత్‌, తోర్తి అరవింద్‌, జక్కుల అఖిలేష్‌, బుర్ర రాహుల్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 11:46 PM