Share News

నిబంధనల ప్రకారం పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ

ABN , Publish Date - Aug 02 , 2026 | 12:04 AM

ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

నిబంధనల ప్రకారం పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ

సిరిసిల్ల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడుతామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌ లో పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా పోలింగ్‌ స్టేషన్ల హేతుబద్ధీకరణ, ఎస్‌ఐ ఆర్‌ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌, ఓటర్ల నమోదు, ఎన్యూమరే షన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ తదితర అంశాలపై కలెక్టర్‌ సమగ్రంగా వివరించారు. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల పరిధి లో 549 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో వేములవాడ నియోజకవర్గంలో 262, సిరిసిల్ల నియోజకవర్గంలో 287పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం 1200మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ స్టేషన్లు లేవని తెలి పారు. ఎస్‌ఐఆర్‌ గడువును ఈనెల10వ తేదీ వరకు ఎన్నికల సంఘం పొడిగించిందని, జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఇప్పటికే జిల్లాలో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటైజేషన్‌ ప్రక్రియ 87.42 శాతం పూర్తయిందని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, అదేరోజు నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు వివరించారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈనెల17 నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు కొనసాగుతుందని, అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈనెల17వ తేదీ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నుంచి సెప్టెం బర్‌ 16వరకు దరఖాస్తులను సమర్పించవచ్చన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, నిష్పక్షపా తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాలన్నారు. సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌వీ కుమారి, పర్యవేక్షకులు ప్రవీణ్‌, ఎలక్షన్‌ విభాగం నాయబ్‌ తహసీల్దార్‌ రెహమాన్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

యూడీఐడీ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల పంపిణీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో యూడీఐడీ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆదేశించారు. శనివారం సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ యూడీఐడీ కార్డుల జారీ పురోగతి, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం లు కుట్టే పనులపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూడీఐడీ దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని సూచించారు.అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల కుట్టించే పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. యూనిఫాంలు నిర్దేశించిన విధంగా నాణ్యతతో కుట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలో యూడీఐడీ దరఖాస్తు ల స్లాట్లు పెంచాలని, హాస్పిటల్లో స్పెషలిస్ట్‌ వైద్యుల సేవలు అందుబా టులో ఉంచాలని సిరిసిల్ల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌కు సూచించా రు. జిల్లాలో 2025 మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 2460 యూడీఐడీ కార్డులు జారీచేయగా, ప్రస్తుతం 524 దరఖాస్తులు అధికారుల పరిశీల నలో ఉన్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఈవో మొండయ్య, మెప్మా ఏఓ మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, డీపీఎం పెన్షన్లు రవీందర్‌, సిరిసిల్ల జీజీ హెచ్‌సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2026 | 12:04 AM