Share News

‘రసమయి’కి సీఎంను విమర్శించే స్థాయి లేదు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:29 AM

మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్‌ ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమ ర్శించే స్థాయి కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షు డు పండుగ ప్రదీప్‌ అన్నారు.

‘రసమయి’కి సీఎంను విమర్శించే స్థాయి లేదు

సిరిసిల్ల టౌన్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి) : మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్‌ ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమ ర్శించే స్థాయి కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షు డు పండుగ ప్రదీప్‌ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ నాయకులతో కలసి రమసమయి బాలకిషన్‌ విలేకరుల మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారన్నారు. మనకొండూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్‌ గతంలో చేసిన అక్ర మాలను ప్రస్తుత ఎమ్మెల్యే ఒక్కొక్కటిగా బయటకు తీస్తు న్నాడని అన్నారు. రసమయికి భూమి శుద్ధి చేసినప్పుడు దళితులు, రెడ్డీలు ఎవరో తెలియకపోవడం విచారకరమ న్నారు. దళితులపై రమమయికి కొంచం కూడా గౌరవం లేకుండా అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడని ఆరో పించారు. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమ ర్శలు చేస్తే గతంలో నిన్ను తరిమినట్లే జిల్లాలో తరిమికొ డతామని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు పసుల వెంకన్న, నక్క నర్సయ్య, కత్తెరపాక ఎల్లయ్య, నాగరాజు, విజయ్‌, శ్రీని వాస్‌, ప్రదీప్‌, తిరుపతి, అంజి, కమలాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:29 AM