గాంధీ ఆశయాలతో రామరాజ్యం
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:28 AM
మహాత్మాగాంధీ ఆశయాలను పాటిస్తూ తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు.
జమ్మికుంట అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ ఆశయాలను పాటిస్తూ తెలంగాణలో రామరాజ్యం తీసుకువస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పదవీ కాంక్ష, డబ్బు ఆశ లేకుండా, కటిక నేలపై జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి మహాత్మాగాంధీ అని పేర్కొన్నారు. రామరాజ్యం అనగానే గాంధీ గుర్తుకొస్తారని, రామరాజ్యం రావాలని ఆయన పరితపించారన్నారు. గాంధీ వారసత్వ రాజకీ యాలకు వ్యతిరేకమని, ఆయన ఆశయాలను పాటించే పార్టీ బీజేపీ అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతి మచ్చ లేకుండా పాలన సాగిస్తోందన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో గాంధీ వారసులుగా రామరాజ్యం తీసుకువస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేవుళ్ల పేరుతో హిందువులను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తప్ప మిగితా సమయాల్లో అంబేద్కర్, గాంధీ జయంతి, వర్థంతి కార్యక్రమాలకు కేసీఆర్ బయటకు రారని విమర్శించారు. ఖైరతాబాద్‌లో హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసి విజ యం సాధిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, మాజీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకట్‌రెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.
202కెఎన్‌ఆర్2
---------------------
5053, 5054 : కోతిరాంపూర్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
మహాత్మాగాంధీకి నివాళి
భగత్‌నగర్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై సునీల్‌రావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.