Share News

రామలింగేశ్వరస్వామి.. సాగునీరందేలా చూడు..

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:02 AM

రామలింగేశ్వరస్వామి పాలకుల మనసులు మారి కెనాల్‌ నిర్మాణం పూర్తి అయ్యి సాగునీరు అందేలా చూడాలని రైతులు వేడుకున్నారు.

రామలింగేశ్వరస్వామి.. సాగునీరందేలా చూడు..

tఇల్లంతకుంట, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి) : రామలింగేశ్వరస్వామి పాలకుల మనసులు మారి కెనాల్‌ నిర్మాణం పూర్తి అయ్యి సాగునీరు అందేలా చూడాలని రైతులు వేడుకున్నారు. మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామంలో రెండు మండలాల రైతులు చేపట్టిన నిరసనదీక్ష ఆదివారానికి ఆరవ రోజుకు చేరుకుంది. శివరాత్రి సందర్భంగా గ్రామసమీపంలోని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజల అనంతరం దీక్షాశిబిరంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం రూ.3.20కోట్లు వెచ్చించి రైతులకు పరిహారం చెల్లిస్తే కెనాల్‌ పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గతంలో నిరసన వ్యక్తం చేసినప్పుడు పలువరు నాయకులు వచ్చి త్వరలోనే పనులు జరిగేలా చూస్తామని హమీ ఇచ్చారని పేర్కొన్నారు. వారు ఇచ్చిన హామీ దీక్ష విరమించామని, సంవత్సరం గడిచినా పనులు ప్రారంభం కాలేదని అన్నారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంభిస్తే త్వరలోనే రైతులందరం ఆమరణ నిరాహారదీక్ష చేపడుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే కెనాల్‌ నిర్మాణం పూర్తి చేసి సాగు నీరందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కరికె నవీన్‌కుమార్‌, సేరు ఎల్లం, కముటం రవి, జంగిటి మోహన్‌, మేకల వెంకట్‌, నవీన్‌, రాజు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:03 AM