ఘనంగా రంజాన్ వేడుకలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:23 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ముస్లింలు శనివారం రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల పట్టణం లోని సాయినగర్ ఈద్గా వద్దకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇమామ్ బోధనలు ఎంతో శ్రద్ధగా విన్నారు. ముస్లింలకు వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
వేములవాడ : రంజాన్ వేడుకలను శనివారం ముస్లింలు వైభవంగా జరుపుకున్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మతగురువులు ప్రార్థనకు హజరైన ముస్లిం సోదరులకు ప్రవచనలు వినిపించారు.
రంజాన్ పండుగ ప్రేమ, శాంతిసౌభ్రాతృత్వానికి ప్రతీక
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంజాన్ పండుగ ప్రేమ, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు ఆయన హజరై ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ రంజాన్ మాసం త్యాగం, సహనం, దయ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలన సమానంగా గౌరవిస్తూ, మైనా ర్టీల సంక్షేవనికి కట్టుబడి ఉందని తెలిపారు. నలరోజుల పాటు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేసి వారి కోరిన కోరి కలు ఫలించాలని ఆకాంక్షించారు. అల్లాహ్ అశీస్సులతో సకాలం లో వర్షాలు సమృద్దిగా కురుసి రైతు వర్గంతో పాటు ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పట్టణంలో ముస్లింలు గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పరిష్కారానికి నోచుకోని షాదీ ఖానా నిర్మాణానికి రూ.80లక్షలు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనకరపు రాకేష్, కౌన్సిలర్లు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం కమిటీ అధ్యక్షులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.