Share News

ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:28 AM

రక్షాబంధన్‌ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యా ప్తంగా ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా రక్షాబంధన్‌ వేడుకలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రక్షాబంధన్‌ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యా ప్తంగా ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం ఉదయం సిరిసిల్లలోని మార్కండేయ దేవాలయం, రాజరాజేశ్వర దేవస్థానం, అయ్యప్ప దేవాలయంతోపాటు వివిధ హ నుమాన్‌ దేవాలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిం చారు. యజ్ఞోపవీతాలకు ప్రత్యేక పూజలు చేసి మార్చు కున్నారు. మార్కండేయ దేవస్థానంలో మార్కం డేయ మహాయజ్ఞం, సామూహిక రక్షాబంధన్‌ నిర్వహిం చారు. రాఖీ పండుగతో వివిధ ప్రాంతాల్లో రోడ్ల పైన మహిళల సందడి కనిపించింది. రాఖీ భండార్‌లు, స్వీట్‌ దుకాణాలు కోలాహలంగా మారాయి.

సిరిసిల్ల టౌన్‌ : రాఖీ పండుగతో సిరిసిల్ల పట్టణం సందడిగా మారింది. ఉదయం నుంచి రాఖీ భండార్‌ లలో రాఖీల కోసం మహిళలు, యువతులు, బాలికలు పోటీపడ్డారు. స్వీట్‌ హౌజ్‌ల వద్ద బారులు తీరారు. సోదరులకు రాఖీ కట్టడం కోసం పుట్టింటికి వెళ్లడానికి బస్టాండ్‌ మహిళలతో కిక్కిరిసిపోయింది. రాఖీ భం డార్‌లు పట్టణంలోని రోడ్లపైనే వెలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్టాప్‌ల వద్ద ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సిరిసిల్ల అర్బన్‌ : సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని గ్రామా ల్లో శుక్రవారం రాఖీ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.రాజీవ్‌నగర్‌ మార్కండేయ ఆలయంలో నూలు పౌర్ణమి మహాయజ్ఞాన్ని నిర్వహించారు. యజ్ఞో పవీత మాగాలు చేసి పద్మశాలీలు జంజిరాలను ధరిం చారు. చంద్రంపేట, రాజీవ్‌నగర్‌లలో మార్కండేయ శోభాయాత్రను ఊరేగించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌లపై ఏర్పాటుచేసిన మగ్గాలపై వస్త్రాల ను తయారుచేసి గ్రామాల్లోని దేవాలయాల్లో దేవుళ్లకు కప్పడంతో పాటు విగ్రహాలకు వేశారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్‌లు బూర బాలమల్లు, మొగిలి నాగరాజు, బుర్ర మల్లికార్జున్‌గౌడ్‌, బోల్గం వైష్ణవినాగరాజుగౌడ్‌, లింగంపల్లి గంగరాజు, మామిడాల మహేష్‌, లింగం పల్లి భాగ్యలక్ష్మీ సత్యనారాయణ, దొంతినేని కళ్యాణి అశోక్‌రావు, పెద్దూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌ జీల కిషన్‌ యాదవ్‌, ఏరవెల్లి వెంకటరమణారావు, భూక్య రెడ్డినా యక్‌, తదితరులు పాల్గొన్నారు.

కోనరావుపేట : అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటి చెప్పే రక్షాబంధన్‌ వేడుకలను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముళ్లకు రాఖీ కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. కోనరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్యకు ఆయన చెల్లెలు ఉడుతల గీత రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల బ్లేస్సి చెట్లకు రాఖీ కట్టి ప్రకృతి ప్రేమను చాటుకుంది.

ఎల్లారెడ్డిపేట : సోదరాభావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం ఘనంగా జరిగాయి మండల కేంద్రంతో పాటు గొల్లపల్లి, బొప్పాపూర్‌, వెంకటాపూర్‌, కోరుట్లపేట, హరిదాస్‌నగర్‌, నారాయణపూర్‌, బండలింగంపల్లి, సింగారం, తిమ్మాపూర్‌, అక్కపల్లి, రాజన్నపేట, అల్మాస్‌పూర్‌, దుమాల, పదిర తదితర గ్రామాల ప్రజ లు ఉదయం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలోని మార్కండేయ దేవాలయం లో పురోహితుడు ఉమాశంకర్‌ ఆధ్వర్యంలో పుణ్యావచనం, అభిషేకం, గణపతి పూజ, హోమం, తదితర కార్యక్రమాలను జరిపించారు. యజ్ఞోపవీతం గావించా రు. సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి ఆప్యా యతను పంచుకున్నారు. పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శివపార్వతుల శోభాయాత్రను సాయం త్రం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారిని పురవీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, తదితరు లు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట : మండలంలోని రాఖీపౌర్ణమి వేడుక లు ఘనంగా జరిగాయి. అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీలు కట్టడానికి వివిధ ప్రాంతాల నుంచి తోబుట్టువులు పెట్టింటికి చేరుకున్నారు. రక్షాబంధన్‌ సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. రాఖీలు అమ్మేదుకాణాలు, స్వీట్‌షాపులు రద్దీగా మారాయి.

గంభీరావుపేట : మండల కేంద్రంతో పాటు గ్రామా ల్లో శుక్రవారం రక్షబంధన్‌ వేడుకలను ఘనంగా నిర్వ హించుకున్నారు. మండలంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

వేములవాడ : వేములవాడ పట్టణంలో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు అన్నాతమ్ముళ్ల చేతికి రాఖీలు కట్టారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నివాసంలో ఆయన సోదరి లీల రాఖీ కట్టి స్వీట్‌ను తినిపించారు. రాజన్న ఆలయ ఈవో ర మాదేవి, బ్రహ్మకుమారీలు వేరువేరుగా విప్‌ ఆది శ్రీని వాస్‌కు రాఖీలు కట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు ప్రతాప రామకృష్ణ నివాసంలో ఆయన సోదరి రాధ రాఖీ కట్టారు.

చందుర్తి : మండలంలోని పలు గ్రా మాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలను శుక్ర వారం ఘనంగా జరుపుకున్నారు. మహి ళలు పుట్టింటికి చేరుకుని సోదరులకు రాఖీ కటి,్ట స్వీట్లు పంపిణీ చేశారు. కార్య క్రమంలో సర్పంచ్‌లు, మాజీప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

రుద్రంగి : మండల కేంద్రంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ లు కట్టి, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగ సందర్భంగా మండలకేంద్రంలో సందడి వాతా వరణం నెలకొంది. కాగా, రుద్రంగి మండల కేంద్రంలో నూలు పౌర్ణమి, రాఖీపౌర్ణమి సంద ర్భంగా మార్కండేయ స్వామి శోభాయాత్రను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పద్మ శాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఓ ట్రాక్టరైపె మగ్గం పెట్టి వస్త్రాన్ని నేశారు. మరో ట్రాక్టర్లో శంకరుడు, మార్కండేయుడు, యముడు, చిత్రగుప్తుడు, బటులు, వివిధ వేషధారణలో శోభాయాత్రను పుర వీధులగుండా నిర్వహిం చారు. మార్కండేయ శోభాయాత్ర అనంతరం మగ్గంపై వేసిన వస్త్రాన్ని వేలం వేశారు. పద్మ శాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలంలో రక్షాబంధన్‌ వేడుకలను శుక్రవారం ఘనంగా జరు పుకున్నారు.తంగళ్లపల్లిలో మార్కండేయ దేవా లయంలో అభిషేక్‌, గణపతి పూజ, హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తం గళ్లపల్లి మార్కడేయ దేవాలయంలో, పద్మన గర్‌లో పద్మశాలీ భవనంలో యఙ్ఞోపవిత ధార ణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సోదరీ మణులు సోదరులకు రాఖీలు కట్టారు. పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారిని ఊరే గించారు. కార్యక్రమాల్లో తంగళ్లపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాపెల్లి ఆనందం, పద్మన గర్‌ పద్మశాలిసంఘం అధ్యక్షుడు మోర శ్రీకాం త్‌, నాయకులు పాల్గొన్నారు.

బోయినపల్లి: మండలంలోని వర్ధవెళ్లి దత్తా త్రేయస్వామి ఆలయంలో పౌర్ణమి సంద ర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వా మివారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వ హించారు. కాగా, అల్ఫోర్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వీ నరందర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

ముస్తాబాద్‌ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఘనంగా రాఖీ సంబురాలు నిర్వహించారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా రాఖీ కట్టి తమ ప్రేమాభిమానాన్ని చాటుకున్నారు. రాఖీదుకాణాల వద్ద మహిళలు, యువతులతో కిటకిటలాడాయి.

Updated Date - Aug 29 , 2026 | 12:28 AM