Share News

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ పనులు

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:39 PM

వేములవాడ రాజరాజేశ్వ రస్వామి ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ పనులు

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వ రస్వామి ఆలయ అభివృద్ధి నిర్మాణ పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవ లప్‌మెంట్‌ అఽథారిటీ(వీటీడీఏ) అధికారులతోపాటు ఇతర అధికారులతో రాజన్న అలయ విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్ది పోచమ్మ అలయ విస్తరణ నిర్మాణ పనులపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను ప్రణాళిక ప్రకారం చేపట్టి వేగవంతంగా, గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని, నిర్మాణ ప్రక్రియలో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యాన్నసత్రం నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసేందుకు మరింత మంది కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పను లను గడువులోగా ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తిచేసేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌ రెడ్డి, ఎస్‌ఈ బీమ్లా నాయక్‌, ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, మోతిలాల్‌, స్థపతి, సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:39 PM