వేగంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు..
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:24 AM
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
వేములవాడ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనుల్లో మరింత వేగం పెంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఆలయ విస్తరణ, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ అభివృద్ధి, మూలవాగు వరకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులను, గుడి చెరువుపై నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, ఇతర ప్రతి అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళాలని సూచించారు. పనుల్లో వేగం పెంచాలని, అవస రమైన పనివారి సంఖ్య మరింతగా పెంచాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు. రాజన్న ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించామన్నారు. రాజన్న, బద్ది పోచమ్మ ఆలయాల విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో గడువు తేదీ ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు సూచించామని అన్నారు. గుడి చెరువు అభివృద్ధి పనులను ఆరు నెలల క్రితం క్షేత్ర స్థాయిలో పరిశీలించామని, ప్రణాళిక ప్రకారం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఆధ్యాత్మికత భావం ఉట్టిపడేలా, భక్తి భావం పెంపొందించేలా మహాశివుడి విగ్రహంతో పాటు, సప్తవత్రికల విగ్రహాలు, అలాగే గుడి చెరువులో బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తెలిపారు. గుడి చెరువులో త్వరలోనే బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టెండర్ దశలో ఉందని, వేగంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి బోటింగ్ సదుపాయాన్ని భక్తులకు, పర్యాటకులకు కల్పించాలని అన్నారు. తుదిదశకు బండ్ నిర్మాణ పనులు వచ్చా యని, త్వరలోనే బండ్‌ను ప్రారంభానికి సిద్దం చేయాలని అన్నారు. నేమ్ బోర్డు, టాయిలెట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ చేయా లని ఆదేశించారు. వారి వెంట ఆర్‌అండ్‌బీ ఈఈ సరసింహాచారి, ఆర్డీవో కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌శర్మ, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, టీపీవో అన్సార్ తదితరులు ఉన్నారు.