Share News

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:39 AM

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల ను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు.

రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు వేగంగా పూర్తి

సిరిసిల్ల, అక్టోబరు 5 (ఆంరఽధజ్యోతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల ను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. సోమ వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం, బద్ది పోచమ్మ ఆలయం తదితర నిర్మాణ పనులపై కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు సమ క్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఇప్పటి వరకు పూర్తిచేసిన పనులపై ఆరా తీశారు. అంతకు ముందు కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ ను కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ స్వాగతించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని సూచించారు. ప్రస్తుత భక్తుల రద్దీ, భవిష్యత్తులో రద్దీకి అనుగుణంగా ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు కల్పించాలని ఆదేశిం చారు. ప్రతి అధికారి ప్రత్యేకశ్రద్ధ పెట్టి ఒక్కో పనికి గడు వు విధిస్తూ వాటిని పూర్తి చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారని, నిధులు మంజూరు చేస్తున్నారని, పనుల ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న పుష్కరాలకు సంబంధించి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటకరంగం విస్తరించేలా ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం పనులు చేయిస్తుం దని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క ఆలయానికి భక్తులు నిరంతరం వెళ్లేలా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసిందని స్పష్టం చేశారు. అధికారులు అన్ని పనులు నిర్ణీత గడు వులోగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని, 80ఫీట్ల రోడ్డును పనులను త్వరగా పూర్తిచేసి వినియో గంలోకి తేవాలని ఆదేశించారు.

విస్తరణ పనులు పూర్తి చేసే అవకాశం..

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు పూర్తి చేసే అవకాశం రావడం అదృష్టమని, దీనిలో అధికారు లు పూర్తిస్థాయిలో భాగస్వాములై పూర్తి చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. శ్రీ విధుశేఖర భారతి స్వామి, సీఎం రేవంత్‌ రెడ్డి సూచనల మేరకు భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులను చేయాలని ఆదేశించారు. అధికారులందరూ ఈ పనులు తమవిగా భావించి పూర్తిస్థాయిలో నిమగ్నమై వేగంగా పూర్తి చేయించాలని సూచించారు. జిల్లాలోని కార్మిక, ధార్మిక ప్రాంతాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రతివారం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తు న్నామని తెలిపారు. వాటిపై సమీక్ష నిర్వహిస్తూ.. పను లు వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సూచనలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి అధికారి తన బాధ్యత ల కాలంలో ఆలయ నిర్మాణం పనుల్లో భాగస్వామ్యులు కావడం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ గౌడ్‌, వేములవాడ ఆర్డీవో కేఎస్‌ బీ కుమారి, ఈఈ భీమ్లానాయక్‌, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈవో రమాదేవి, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం శ్రీనివాస్‌, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఈఈ రాజేష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌, తహసీల్దార్‌ జయంత్‌, వీటీఏడీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:39 AM