Rajanna Siricilla: స్వచ్ఛ శౌచాలయంతో గౌరవప్రదమైన భవిష్యత్
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:43 AM
సిరిసిల్ల, నవంబరు 21 (ఆంరఽధజ్యోతి): ‘స్వచ్ఛశౌచాలయంతో గౌరవప్రదమైన భవి ష్యత్’ నినాదంతో జిల్లాలో కార్యక్రమాలు నిర్వ హించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారు లను ఆదేశించారు.
- విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
- కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల, నవంబరు 21 (ఆంరఽధజ్యోతి): ‘స్వచ్ఛశౌచాలయంతో గౌరవప్రదమైన భవి ష్యత్’ నినాదంతో జిల్లాలో కార్యక్రమాలు నిర్వ హించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారు లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం, స్వచ్ఛ శౌచా లయం గౌరవప్రదమైన భవిష్యత్ కార్యక్రమా న్ని పురస్కరించుకొని అధికారులతో కలిసి పోస్టర్లు, బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో అక్టోబర్ 19నుంచి డిసెంబర్ 10వతేదీ వరకు కార్యక్ర మాలు నిర్వహించాలని అన్నారు. మరుగుదొడ్డి లేని వారు నిర్మించుకోవాలని, నిర్మించుకున్న మరుగుదొ డ్లను ఉపయోగంలో ఉండేలా చూడాలని సూచిం చారు. అన్ని అంగన్వాడీకేంద్రాలు, వీవో భవనాలు, పాఠశాలలు, పబ్లిక్‌ప్రదేశాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌నిర్మాణాలు చేయాలన్నారు. వాటికి తప్పని సరిగా నీటిసదుపాయం ఉండేలా చూడాలన్నారు. ఈ మేరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వ హించాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే నిర్మిం చిన ఇందిరమ్మ గృహాల మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను అలంకరించి ప్రారంభించేం దుకు సిద్ధం చేయాలని తెలిపారు. గ్రామాల్లో ఇంకా మరుగుదొడ్లు నిర్మించుకోని వారిని గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎస్‌బీఎం బాధ్యులు సురేష్, ప్రేమ్‌కుమార్ తది తరులు పాల్గొన్నారు.
విద్యార్థుల హాజరుశాతం పెంచాలి
సిరిసిల్ల అర్బన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠ శాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఎఫ్‌ఆర్‌ఎస్, ఎఫ్‌ఎల్‌ఎన్, ఆన్‌లైన్ తరగతులు, అభివృద్ధి పనులు తదితరఅంశాలపై విద్యా శాఖ, పంచాయతీరాజ్, టీజీఈడడ్య్లూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షిం చారు. ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా టీచర్లు, విద్యాధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బడికి హాజరుకాకపోవడానికి కారణాలు తెలు సుకోవాలని, నిత్యంవచ్చేలా పర్యవేక్షణ చేయా లని ఆదేశించారు. అదేవిధంగా యంగ్ ఇండి యాఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం నిర్మాణపనుల్లో మరింత వేగంపెంచాలని ఆదేశించారు. పనులకు అను గుణంగా కూలీల సంఖ్య పెంచాలన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్‌నిర్మాణ పనులను మొదలుపెట్టాలని తెలి పారు. నాబార్డు నిధులతో విద్యాలయాల్లో చేపట్టిన పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. పీఎం ఉష కింద గంభీరావుపేట, అగ్రహారంలో నిర్మాణపనులను గడువులోగా పూర్తి చేసి నియోగం లోకి తీసుకురావాలని తెలిపారు. ఫిజిక్స్‌వాలా, ఖాన్ అకాడమీ ఆన్‌లైన్ తరగతులను అన్ని విద్యాల యాలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో తప్పనిసరిగా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి విజయ సాగర్, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, వివిధ మండలాల విద్యాధికారులు పాల్గొన్నారు.