Rajanna Sircilla: నియోజకవర్గానికి మణిహారంగా వైఐఐఆర్‌ఎస్
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:12 AM
చందుర్తి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మణిహారంగా నిలుస్తుందని ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు.
-సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
-మూడపల్లిలో రూ.200కోట్లతో కలెక్టర్‌తో కలిసి వైఐఐఆర్‌ఎస్‌కి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
చందుర్తి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక మణిహారంగా నిలుస్తుందని ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆధ్వర్యంలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్(వైఐఐఆర్‌ఎస్) నిర్మాణానికి శనివారం ఆయన, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిలుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్యావిధా నంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమూల మార్పులు చేస్తున్నారని అన్నారు. పేదపిల్లలకు కార్పొరేట్‌స్థాయి విద్యను అందించేందుకు సకల సౌకర్యాలతో ఇటు వంటి స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ స్కూల్‌లో 2600మంది విద్యార్థులు చదువుతారని, భవన నిర్మా ణాన్ని 18నెలల్లో పూర్తిచేస్తారని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన వారి సహకారం మరువలేనిదని కొనియాడారు. ఐటీఐలను ఏటీసీలుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. రుద్రం గిలో 10ఎకరాల్లో రూ.46 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. హైదారాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడిం చారు. త్వరలో వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్‌స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మధ్యమానేరు ముంపు గ్రామాల ప్రజలకు సీఎం అండగా ఉంటారన్నారు. మర్రిపల్లిలో 40ఎకరాలలో రైతు విజ్ఞానకేంద్రం ఏర్పాటు చేయనున్నామని అన్నారు. దీంతో రైతులకు భూసార పరీక్షలు చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. రూ.1000కోట్ల నిధులతో జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని, జిల్లా పురోగతిలో భాగస్వామ్యులు కావాలని పిలువు నిచ్చారు.
కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వేముల వాడ నియోజకవర్గంలో అన్నివసతులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జిల్లాలో 61 ప్రీపైమ్రరీ స్కూల్స్ ప్రారంభం అయ్యాయని తెలి పారు. టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎండీ గణపతిరెడ్డి మాట్లా డుతూ.. రాష్ట్రంలో 105యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయగా, 60 చోట్ల పనులు మొదలయ్యాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సర్పంచ్ చిలుక మల్లేశ్వరి-అంజిబాబు, వేములవాడ మున్సిపల్‌చైర్మన్ పుల్కం రాజు, మార్కె ట్‌కమిటీ చైర్మన్లు, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ నరాలశేఖర్, ఆత్మ కమిటీచైర్మన్ ముకుంద రెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎస్‌ఈ రవీందర్, ఈఈ అశోక్‌కుమార్, వేములవాడ ఆర్డీఓ కే ఎస్‌బీ కుమారి, తహసీల్దార్ భూపతి, ఎంపీడీవో రాధ, ఏఈ శ్రీకాంత్, రుద్రంగి ఏఎం చైర్మన్ చెలుకల తిరుపతి, మాజి జడ్పీటీసీలు నాగంకుమార్, పోద్దుపోడుపు లింగారెడ్డి, వేములవాడ, కథలాపూర్ మేడిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, వివిధగ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.