Share News

Rajanna Sircilla: సంక్షేమ పథకాలు అందజేయడంలో గ్రామశాఖలే కీలకం

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:50 PM

కోనరావుపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేద లకు అందజేయడంలో గ్రామ శాఖలే కీలకంగా పనిచేయా లని ప్రభుత్వవిప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీనివాస్‌ అన్నారు.

 Rajanna Sircilla:  సంక్షేమ పథకాలు అందజేయడంలో గ్రామశాఖలే కీలకం

- ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేద లకు అందజేయడంలో గ్రామ శాఖలే కీలకంగా పనిచేయా లని ప్రభుత్వవిప్‌, వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట కాంగ్రె స్‌పార్టీ మండలశాఖ, 28 గ్రామాలకు సంబంధించిన గ్రామశాఖ అధక్షులు అందరూ ఆది శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. మండల శాఖలో గ్రామ శాఖలో నియమితులైన అందరినీ ఆది శ్రీనివాస్‌ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద ర్భంగా ఆదిశ్రీనివాస్‌ మాట్లాడుతూ నియమింప బడ్డ సభ్యులు అందరూ కూడా గ్రామాల్లోని కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను, పథకా లను పేదవారికి అందేలా చూడాలన్నారు. కార్య క్రమంలో జిల్లా కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, జిల్లాకార్యదర్శి షేక్‌ఫిరోజ్‌ పాషా, మండల శాఖ, వివిధ గ్రామశాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:50 PM