Rajanna Sircilla: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:45 AM
సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నా రు.
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- సిరిసిల్లలో స్మార్ట్‌రేషన్ కార్డుల పంపిణీ
సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): పేదల సంక్షేమమే ప్రజాప్రభుత్వ లక్ష్య మని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. శనివారం సిరిసిల్లలోని రగుడు వద్ద ఫంక్షన్‌హాల్లో పౌరసరఫరాలశాఖ ఆధ్వ ర్యంలో స్మార్ట్‌రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించారు. ప్రతి మండలానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్‌కార్డులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలో 24174నూతన రేషన్‌కార్డులను మంజూరు చేసిం దని తెలిపారు. జిల్లాలో 195915స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు గుర్తింపు కార్డు మాత్రమే కాదని, పేదలకు గౌరవంతో పాటు ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలకు ఉపయోగపడే ముఖ్యమైన పత్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలశాఖ అధికారుల ద్వారా పట్టణా లు, గ్రామాలవారీగా స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. పేదలకు సన్న బియ్యం అందిస్తున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ అన్నారు. జిల్లాలో ప్రతినెలా 3700మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తు న్నామని వెల్లడించారు. సంపన్నులు తినే సన్న బియ్యాన్ని పేదలు కూడా తినాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ కార్య క్రమాన్ని అమలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. పేదలసంక్షేమం, రైతులు, మహిళలు, నేతన్నలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రతి రేషన్ లబ్ధిదారుడికి సన్నబియ్యం
ప్రభుత్వఆదేశాల మేరకు జిల్లాలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ ప్రారంభించామని కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సోమవారం అన్ని మండలాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో టీ రేషన్ యాప్ లో రేషన్ సరుకులు, రేషన్ దుకాణాలు, స్టాక్ నిలువలు, పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, ఆత్మకమిటీ డివిజన్ చైర్మన్ ముకుంద రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు కేఎస్‌బీ కుమారి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.