Share News

Rajanna Sircilla: సంక్షేమ పథకాలు అందించంలో ప్రభుత్వం ఆదర్శం

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:08 AM

ఇల్లంతకుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలు స్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

Rajanna Sircilla:   సంక్షేమ పథకాలు అందించంలో ప్రభుత్వం ఆదర్శం

- మానకొండూర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణ

ఇల్లంతకుంట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలు స్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని ఇల్లంత కుంట, వల్లంపట్ల తదితర గ్రామాల్లో శనివారం అభి వృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ నిరుపేదలయిన ప్రతిఒక్కరి ఇంటి నిర్మాణం చేయిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంఅన్నారు. అర్హులైన ప్రతికుటుంబానికి రేషన్‌కా ర్డులు మంజూరు చేయడమే కాకుండా స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేశామన్నారు. సంక్షేమపథకాలు అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తు న్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందా లని అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. అన్ని గ్రామాలలో మహిళలకు సంఘభవనాలను నిర్మిస్తున్నామని, మహిళలు విద్యా వంతులు కావాలని సూచించారు. కార్యక్రమంలో మండలప్రత్యేక అధికారి రామకృష్ణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, ఫ్యాక్స్‌చైర్మన్‌ రమణారెడ్డి, డైరెక్టర్‌ ఒగ్గు రమేష్‌, తహసీల్దార్‌ రాచ కట్ల సురేష్‌, ఎంపీడీవో శశికళ, డీ సాజిద్‌, సర్పంచ్‌లు నేరెళ్ల విజయ్‌ గౌడ్‌, కాత మల్లేశం, చల్ల నవీన్‌ రెడ్డి, చొప్పరి భూమయ్య, నాయకులు పసుల వెంకటి, ఎలగందుల ప్రసాద్‌, తిరుపతి, తూముకుంట రాజేం దర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..

మండలంలోని వల్లంపట్ల గ్రామంలో మహిళా సంఘ భవనాన్ని, ఇల్లంతకుంటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు నోట్‌బుక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘభవనానికి స్థలాన్ని ఇచ్చిన కట్ట సౌమ్యశ్రీకాంత్‌రెడ్డిని అభినందించారు. విద్యార్థులు అంకితభావంతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. వల్లంపట్ల గ్రామంలో మధ్యమానేరు కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని విన్నవించారు. అధి కారులతో మాట్లాడి నీటివిడుదలకు కృషిచేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ దేవరాజం, ఎమ్‌ఎస్‌ అధ్యక్షురాలు కట్ట సౌమ్య, సూపరవైజర్లు చంద్రకళ, ఉమారాణి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:08 AM