Rajanna Sircilla: ప్రజలకు మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:11 AM
చందుర్తి జూలై 26 (ఆంధ్ర జ్యోతి): ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వవిప్ ఆదిశ్రీనివాస్ ఆన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి జూలై 26 (ఆంధ్ర జ్యోతి): ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వవిప్ ఆదిశ్రీనివాస్ ఆన్నారు. వేములవాడ ఆర్టీసీ బస్‌డిపో నుంచి ఎనగల్, బండపల్లి, మరిమడ్ల మీదుగా నిజా మాబాద్ జిల్లా సిరికొండ వరకు నూతన బస్ సర్వీసును ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారం భించారు. ఈ కొత్తబస్ సర్వీసుతో రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల మధ్య రవాణా అనుసంధా నం మరింత బలోపేతం కానుంది. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు కరీంనగర్‌కు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేములవాడ నుంచి వివిధ ప్రాంతాలకు దశలవారీగా కొత్త బస్సుసర్వీసులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీసు ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని, స్థానిక ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభరాణి, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, నాయకులు ల్యాడె సత్తయ్య, గసికంటి ప్రభాకర్, లింగంపల్లి హన్మంతు, కట్కం మల్లేశం, ధర్మపురి శ్రీనివాస్, లింగంపల్లి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.