Rajanna Sircilla: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచాలి
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:14 AM
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణకార్యదర్శి పంతం రవి అన్నారు.
- సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణకార్యదర్శి పంతం రవి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కార్మికభవనంలో లాల్ బావుట చేనేత, పవర్‌లూం కార్మికసంఘ సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమా వేశంలో రవి మాట్లాడారు. ఈనెల31తో చేయూత పింఛన్ల దరఖాస్తులు ముగు స్తున్నాయని జిల్లా కలెక్టర్ చెపుతున్నా సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ అధికారులు మాత్రం నేతన్న చేయూత పథకానికి అవసరమైన చేనేత జౌళిశాఖ గుర్తింపు కార్డులను జారీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. దరఖాస్తు చేసుకున్న వారిలో కొంతమందికే గుర్తింపుకార్డులను జారీచేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోం దని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలకులను పెంచకుండా కంటితుడుపు చర్యగా పనులను చేనేత, జౌళిశాఖ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనివల్ల చేనేత, పవర్‌లూం దాని అనుబంధరంగాల కార్మికులు పెద్దఎత్తున పింఛన్లు రాక నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, కలెక్టర్ దరఖాస్తుల గడువును పెంచాలని.. కార్మికులందరికీ చేనేత, జౌళిశాఖ నుంచి త్వరగా గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత, జౌళిశాఖ అధికారులు తమవిధానాన్ని మార్చుకోకపోతే అర్హులైన కార్మి కులు నష్టపోతే అన్ని రాజకీయపార్టీలను కలుపుకొని సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు సోమ నాగరాజు, హరికృష్ణ, రాజమల్లు పాల్గొన్నారు.