Share News

Rajanna Sircilla: చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:15 AM

వీర్నపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్‌ ఎస్‌ జిల్లాఅధ్యక్షుడు తోటఆగన్న ఆరోపిం చారు.

 Rajanna Sircilla:   చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ

- జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

వీర్నపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్‌ ఎస్‌ జిల్లాఅధ్యక్షుడు తోటఆగన్న ఆరోపిం చారు. మండలకేంద్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమా లపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తోట ఆగన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం 100రోజుల్లో 6గ్యారంటీలు అమలుచేస్తామని హామీఇచ్చి, 1000రోజులు గడిచినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతుభరోసా, రైతు రుణమాఫీ, రైతుబీమా, మహిళలకు మహా లక్ష్మి పథకం, తులం బంగారం, పింఛన్ల పెంపు, నిరుద్యోగభృతి, ఉద్యోగాల భర్తీ వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.

రైతుల వినూత్న

నిరసన..

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నమ్మి మోస పోయామ ని ఆరోపిస్తూ ముఖ్రా (కే) గ్రామానికి చెందిన రైతులు పంట పొలాల్లో 6గ్యారంటీలు, 420 హామీల ప్లకార్డులు ప్రద ర్శిస్తూ నిరసన తెలి పారు. ఒంటికాళ్లపై నిల బడి గుంజీలు తీస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.15వేల రైతుభరోసా, రైతుబీమా వంటి హామీలను వెంటనే అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ మడుగుల మల్లేశం, స్థానిక సర్పంచ్‌ మల్లారపు జ్యోత్స్న అరుణ్‌, జడ్పీ మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ చాంద్‌ పాషా, జిల్లా బంజారాసేవా సంఘం అధ్య క్షుడు గుగులోత్‌ సురేష్‌నాయక్‌, మహిళా మండల అధ్యక్షురాలు గుగులోత్‌ కళ తిరుపతి నాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:15 AM