Rajanna Sircilla: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చట్టం చేసే వరకు పోరాటం
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:04 AM
సిరిసిల్ల టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు వ్యతి రేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసే వరకు శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగిస్తామని
- మాలమహానాడు నేషనల్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రత్నాకర్
సిరిసిల్ల టౌన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు వ్యతి రేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసే వరకు శాంతియుతంగా, గాంధేయ మార్గంలో పోరాటం కొనసాగిస్తామని మాలమహానాడు నేషనల్ రాక్స్ ప్రెసి డెంట్ డాక్టర్ ఎస్ రత్నాకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కెమిస్ట్‌అండ్‌డ్రగిస్ట్ భవన్‌లో విలేకరుల సమావేశంలో రత్నాకర్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశ వ్యాప్తంగా దళితులపై రాజకీయ కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో మొట్టమొదటిసారిగా పంజాబ్, హర్యాన రాష్ట్రాల్లో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీవర్గీకరణను శాంపిల్‌గా చేసిం దని, దీన్ని నేడు మోదీ దేశం మొత్తం చేశాడని ఆగ్ర హం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాల వర్గంపై కుట్రలు చేశాయని వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాలసామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కెస్తా ఉంటే మాల ప్రజాప్రతి నిధులు నోరు మెదపకపో వడం విచారక రమన్నారు. మాల సామాజిక వర్గం తలుచుకుంటే ఏ చట్టాల నైనా ప్రభుత్వాలు వెనక్కి తీసు కోవాల్సిందేనని అన్నారు. ఇకనైనా శాంతియుత పోరాటా లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాల మహానాడు నేషనల్ రాక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ రత్నాకర్‌ను జిల్లానాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛా లతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయ కులు బొజ్జ శరత్‌బీరం, సతీష్‌కుమార్, పలిగిరి కనకరాజు, వేచలదారా నూకరాజు, కామా ప్రభాకర్, జక్కుల యాదిగిరి, నేరటి శ్రీనివాస్, తుంగ శివరాజు, మూలె కిషోర్, ఎడ్ల సందీప్, తీగల శ్రీనివాస్, గజ్జెలి లక్ష్మన్ పాల్గొన్నారు.