Rajanna Sircilla: నకిలీ విత్తనాలు, నాణ్యతలేని ఎరువులను విక్రయిస్తే కఠినచర్యలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:41 AM
సిరిసిల్లఅర్బన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీవిత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయించినా.. అక్రమరవాణా చేస్తూ పట్టుబడి నా వారిపై పీడీయాక్ట్‌ను అమలు చేస్తామని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
- ఎస్పీ మహేష్ బీగీతే
సిరిసిల్లఅర్బన్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నకిలీవిత్తనాలు, నాణ్యత లేని ఎరువుల విక్రయించినా.. అక్రమరవాణా చేస్తూ పట్టుబడి నా వారిపై పీడీయాక్ట్‌ను అమలు చేస్తామని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు. జిల్లాకేంద్రంతో పాటు జిల్లావ్యాప్తంగా శనివారం ఫెర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయాధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. సిరిసిల్ల పట్ట ణంలో తనిఖీలను ఎస్పీ పర్యవేక్షించారు. ఫర్టిలై జర్ దుకాణాల్లో స్టాక్‌రిజిస్టర్‌లు, విక్రయ రికార్డు లు, లైసెన్స్‌లు, ఎరువులు, విత్తనాల నిల్వలను బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమరవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీస్, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నకిలీవిత్తనాల విక్రయాలకు పాల్ప డిన వారిపై ప్రత్యేకనిఘా ఏర్పాటుచేసి వారి కదలిక లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పని సరిగా బిల్లు తీసుకోవాలని, నాణ్యతపై అనుమానం ఉన్నా లేదా ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందులు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.
మాదకద్రవ్యాల నియంత్రణ,
సైబర్‌నేరాలపై ప్రత్యేక దృష్టి
వేములవాడ : మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బి గితే సూచించారు. వేములవాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీచేశారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది పనితీరు, శాంతి భద్రతలకి తీసుకున్న చర్యలపై అధికారులతో సమీక్షిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టేషన్‌లో నిర్వ హిస్తున్న సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించాలని, సైబర్‌నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగహన కల్పించాలని, రహదారి భద్రత చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో వున్న అండర్ ఇన్వేస్టిగేషన్ కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి కేసు దర్యాప్తు పురోగతిని నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. వారివెంట డీఎస్పీ శ్రీనివాసులు, టౌన్ సీఐ వీరప్రసాద్‌లు ఉన్నారు.