Rajanna Sircilla: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:00 AM
వేములవాడ రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే నని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు.
-యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న
వేములవాడ రూరల్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే నని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. వేములవాడ ఆర్టీసీ డిపోను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలోని పలు యూనియన్ల నుంచి దాదాపు 50మంది కార్మికులు ఆయన సమక్షంలో ఎంప్లాయీస్ యూని యన్‌లో చేరారు. అనంతరం ఈదురు వెంకన్న మాట్లా డుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే వరకు నిద్రపోయేది లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షే మంకోసం చేసిన సమ్మెలో పాల్గొనని పలుయూనియన్ల నాయకులు కార్మికులను మభ్యపెడుతూ మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. కార్మికుల కష్టాలు తీర్చేది, కన్నీళ్లు తుడిచేది, హక్కులు కాపాడేది కేవలం ఎర్రజెండా మాత్రమేనన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్రకార్యదర్శి కొమ్మ కొమురయ్య, డిపోఅధ్యక్షుడు జీఆర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేష్, కార్యదర్శి రవీందర్, కోశాధికారి గంగారాం, వర్కింగ్ ప్రెసిడెంట్ శివకృష్ణ, ప్రచారకార్యదర్శి లక్ష్మిరాజం, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గౌస్, మహిళా సెక్రెటరీ భాగ్యలక్ష్మి, రేణుక, నాయ కులు గణపతి, నరసింహులు, రాజ య్య, దేవయ్య, గోపి, అఫ్రోజ్, ధర్మ రాజు, శివప్రసాద్, అంజయ్య, రాజు, రాజేందర్, కిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.