Rajanna Sircilla: రైతులకు అందుబాటులో ఉంటూ.. సేవలు అందించాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:42 AM
బోయినపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం...
బోయినపల్లి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలం కోరెం సింగిల్‌విండో చైర్‌పర్సన్‌గా వన్నెల మమత రమణారెడ్డితోపాటు డైరెక్టర్‌లు శనివారం పదవీబాధ్యతలు చేప ట్టారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కరీంనగర్‌లోని ఎమ్మెల్యేనివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీచైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్, సర్పంచ్‌లు జంగం అంజ య్య, ఉపసర్పంచ్‌లు కందుల గంగారెడ్డి, గుడిసెల తిరుపతి, నాయ కులు నాగుల వంశీ, కొలుపుల ప్రవీణ్, గంగాధర లక్ష్మణ్, మడ్లపల్లి గంగయ్య, అమ్మిగల్ల గోపాల్, సత్య నారాయణ రెడ్డి, ఏండి బాబు, మంద వెంకటేష్, శేఖర్ రెడ్డి, కరుణాకర్, నేరెళ్ల అంజయ్య, ఉన్నారు.