Share News

Rajanna Sircilla: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:18 AM

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జిల్లాజేఏసీ చైర్మన్‌ గజ్జెల దేవ రాజు అన్నారు.

Rajanna Sircilla:  తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాలి

- తెలంగాణ ఉద్యమకారుల జిల్లా జేఏసీ చైర్మన్‌ గజ్జెల దేవరాజు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జిల్లాజేఏసీ చైర్మన్‌ గజ్జెల దేవ రాజు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారుల జిల్లా జేఏసీ సమావేశం జరిగింది. ఉద్యమకారులు జేఏసీ చైర్మన్‌గా గజ్జెల దేవరాజు, గౌరవఅధ్యక్షుడిగా బుస్సవేణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనం తరం ఉద్యమకారులు వారిని గజమాలతో సన్మా నించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవరాజు మాట్లాడారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకా రులను గుర్తిస్తామని కొన్ని హామీలను ఇచ్చారన్నారు. అయితే కాంగ్రెస్‌పార్టీ వచ్చి దాదాపు మూడు సంవత్స రాలైనా కేశరావు కమిటీపేరుతో కాలయాపన చేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమకారులంద రినీ ఏకతాటిపైకి తీసుకు వస్తామన్నారు. త్వరలో రాష్ట్ర జేఏసీ కార్యాచరణ ప్రకారం తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పోరాటాలను జిల్లాలో ముందుకు తీసుకెళతామ న్నారు. కాలయాపన చేయకుండా సెప్టెంబర్‌17 లోపు ప్రభుత్వం, కేశవరావు కమిటీ, తెలంగాణ ఉద్యమకారు లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనిపక్షంలో రానున్న రోజులలో జరగబోయే పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ రాచర్ల వెంకన్న, నాయకులు కర్నె లక్ష్మి, మడుగుల వనజ, గుగులోతు రేణ, బండి దేవదాస్‌, అక్కెనపల్లి కరుణాకర్‌, ఫణిరాజరావు, రంగు ప్రసాద్‌, తిరునారి భాను, పసుల బాబు, నిమ్మశెట్టి విజయ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, సయ్యద్‌ అఫ్రోజ్‌, శేక్‌సికిందర్‌, సాయి కుమార్‌, షబ్బీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:18 AM