Share News

Rajanna Sircilla: పెండింగ్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:54 PM

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ డిమాండ్‌ చేశారు.

Rajanna Sircilla:  పెండింగ్‌ ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో శనివారం బీజేపీ జిల్లా కమిటీ ఆఽధ్వర్యంలో ఫీజు బకాయి- బీజేపీ లడాయి దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో ఫీజురీయంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలంటూ నినాదాలు చేయడంతోపాటు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. ఈ దీక్షలో పాల్గొన్న గోపీ మాట్లాడుతూ రాష్ట్రం వ్యాప్తంగా చదువుకుంటున్న 40లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పెండింగ్‌లో పెట్టడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్‌లను ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. వెంటనే ఫీజురీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. దీక్షా శిబిరంలో జిల్లా ఇన్‌చార్జీ గంగాడిమోహన్‌రెడ్డి, బీజేవైఎం జిల్లాఅధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యానరాంప్రసాద్‌, ఎర్రం మహేష్‌, లింగంపల్లి శంకర్‌, కుమ్మరి శంకర్‌, జిల్లా ప్రధానకార్యదర్శి పోన్నాల తిరుపతిరెడ్డి, సిరికొండ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ అఽధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, మండలాల అధ్యక్షులు రేపాక రామచంద్రంరెడ్డి, మీరాల్‌కార్‌ బాలాజీ, సౌల్ల క్రాంతి, వెన్నమనేన శ్రీధర్‌రావు, రేగులసంతోష్‌బాబు, మాలోత్‌ సాయికిరణ్‌ నాయక్‌, జలపతిరెడ్డి, కర్నె హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:54 PM