Rajanna Sircilla: ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలి
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:15 AM
సిరిసిల్ల అర్బన్, జూలై 4 (ఆంఽధ్రజ్యోతి): పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించా లని, ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేం దుకు రైతులను
- వీడియోకాన్పరెన్స్‌లో రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జూజు
సిరిసిల్ల అర్బన్, జూలై 4 (ఆంఽధ్రజ్యోతి): పంట మార్పిడి విధానాలను ప్రోత్సహించా లని, ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేం దుకు రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంజయ్‌జూజు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జరిగిన వీడియో కాన్సరెన్స్‌లో హైదరాబాద్ సచివా లయం నుంచి రాష్ట్రప్రభుత్వ ప్రధానకార్యదర్శి వ్యవసాయం, ఎరువుల లభ్యత, ఫార్మర్ రిజిస్ట్రీ, తదితర అంశాలపై కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 2026-27 సంవత్సరానికి రాష్ట్రంలో 85వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. లక్ష్య సాధనకు జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకోసం కార్యాచరణ రూపొందించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. పంట మార్పిడి విధానాలను విస్తృ తంగా అమలు చేయడంతో పాటు కూరగాయల సాగు ను ప్రోత్సహించా లని అన్నారు. వ్యవ సాయానికి అవసర మైన యూరియా, డీఏపీ, ఇతర కాం ప్లెక్స్‌ఎరువులు రైతు లకు అందుబాటులో ఉంచాలన్నారు. వర్షాకా లాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలే రియా, టైఫాయిడ్ తదితర కాలానుగుణ వ్యాధులు వ్యాపించకుండా వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర సంబంధితశాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు నివా రణచర్యలు చేపట్టాలని అదేశించారు. వీడి యోకాన్ఫరెన్స్‌లో అదనపుకలెక్టర్ గడ్డం నగేష్, టైన్రీడిప్యూటీకలెక్టర్ నిఖిత, జిల్లావ్యవసాయ, ఉద్యానవన, వైద్యఆరోగ్య, పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పంచాయతీ,మున్సిపల్, రెవె న్యూ తదితరశాఖలఅధికారులు పాల్గొన్నారు.