Share News

Rajanna Sircilla: ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:06 AM

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లాకేంద్రం మినీస్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఘనంగా జిల్లాస్థాయి జాతీయ క్రీడా దినోత్స వంను నిర్వహించారు.

Rajanna Sircilla:  ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

- జిల్లాస్థాయి వాలీబాల్‌, కబడ్డీ, ఆర్చరీ పోటీలు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లాకేంద్రం మినీస్టేడియంలో హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా ఘనంగా జిల్లాస్థాయి జాతీయ క్రీడా దినోత్స వంను నిర్వహించారు. వాలీబాల్‌, కబడ్డీ, ఆర్చరీపోటీలను జిల్లా యువజనక్రీడల శాఖ అధికారి అజ్మీరా రాందాస్‌ ప్రారంభించారు. అనంతరం వివిధ మండలాల నుంచి వచ్చిన వాలీబాల్‌, కబడ్డీ జట్లు తలపడగా ఆర్చరీ క్రీడాకారుల మధ్య హోరాహోరీగా పోరుసాగింది. సాయంత్రం స్టేడియంలో జరిగిన విజేతలకు బహుమతుల ప్రదానం సమావేశానికి జిల్లా విద్యాధికారి మొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు మెడల్స్‌, సర్టిఫికెట్లను అందించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లాఅగ్రికల్చరల్‌ అధికారి అఫ్జల్‌ భేగం, నెహ్రూయువజన కేంద్రం కోఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూని వర్సిటీ నోడల్‌అధికారి దేవత ప్రభాకర్‌, వాలీబాల్‌ అకాడమీ కోచ్‌లు సంపత్‌, జగన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2026 | 12:06 AM