Share News

Rajanna Sircilla: వర్షాలు సమృద్ధిగా కురిపించు పోచమ్మతల్లీ

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:08 AM

సిరిసిల్ల టౌన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్ధిగా కురుపించు తల్లీ అంటూ భక్తులు పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు.

Rajanna Sircilla: వర్షాలు సమృద్ధిగా కురిపించు పోచమ్మతల్లీ

పోచమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు

సిరిసిల్ల టౌన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వర్షాలు సమృద్ధిగా కురుపించు తల్లీ అంటూ భక్తులు పోచమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆషాడ మాసం రెండోఆదివారం కావడంతో జిల్లా కేంద్రంలోని ముత్యాలపోచమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. మున్సిపల్‌ పరిధిలోని వివిధవార్డుల నుంచి మహి ళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని కుటుంబ సమే తంగా ముత్యాలపోచమ్మ దేవాలయానికి చేరుకొన్నా రు. అనంతరం అమ్మవారికి బోనాలు, ప్రసాదాలను సమర్పించుకున్నారు. మరికొందరు ముడుపులు కట్టారు. దేవాలయలం పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలను వితరణ చేశారు.

బోయినపల్లి : బోయినపల్లిలో మండల కేంద్రంలో గౌడకులస్తులు ఆదివారం పోచ మ్మబోనాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నెత్తినబోనం ఎత్తు కొని భక్తిశ్రద్దల మధ్య ర్యాలీగా పోచమ్మ ఆల యానికి తరలివెళ్లారు. అనంతరం పోచమ్మ దేవతకు నైవేద్యం సమర్పించారు. పిల్లాపాపలు చల్లగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ బోయిని ఎల్లేష్‌ యాదవ్‌, సర్పంచ్‌ నల్లా మోహన్‌ గౌడ కులస్తులు మహిళలు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట : మండలంలోని పలు గ్రామాల్లో పోచమ్మబోనాలు ఘనంగా నిర్వహిం చారు. సోమారంపేట, ఇల్లంతకుంట గ్రామాల్లో ఆదివారం డప్పుచప్పుల్లు, శివసుత్తుల పూనకాల మధ్య మహి ళలు బోనాలు ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భారతమ్మచ ఏఎమ్‌సీ డైరెక్టర్‌ః సురేందర్‌రెడ్డి, మాజీస ర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డితోపాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కులసంఘూల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

గంభీరావుపేట: మండల కేంద్రంలో బోనాల పండుగ ఆదివారం అత్యంతవైభవంగా నిర్వహిం చారు. ఆషాడమాస బోనాలలో భాగంగా స్థానిక పూసల సంఘం ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్ల నడుమ మహం కాళి అమ్మవారికి మహిళలు బోనమెత్తారు. బోనాలను నెత్తినెత్తుకుని భక్తి శ్రద్ధలతో మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యం సమర్పించి, ప్రత్యేకపూజలు చేశారు.

కార్యక్రమంలో మండల పూసల సంఘం అధ్యక్షుడు అనిల్‌, డివిజన్‌ అద్యక్షుడు అంజనేయులు, జిల్లా ఉపాద్యక్షుడు రవి, కోశాదికారి సత్యం, సంఘం నాయకులు రాజేశం, నర్సింలు, రమేష్‌, సత్యం, వెంకట్రాములు, బాలరాజు, దేవరాజు, రాకేష్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:08 AM