Share News

Rajanna Sircilla: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

ABN , Publish Date - Aug 16 , 2026 | 12:44 AM

సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): జిల్లా కేంద్రంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని త్రివర్ణ శోభితంగా ఘనంగా నిర్వహించారు.

Rajanna Sircilla: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం

సిరిసిల్ల, ఆగస్టు 15 (ఆంరఽధజ్యోతి): జిల్లా కేంద్రంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని త్రివర్ణ శోభితంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌, క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్‌లో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ గడ్డంనగేష్‌, డీఆర్‌వో జయశ్రీ, ఏవో రాంరెడ్డి, వివిధశాఖల జిల్లా అధికా రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : సిరిసిల్ల పట్టణం గాంధీచౌక్‌ వద్ద, మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా గ్రంథాలయం కార్యాలయం ఎదుట చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట నాప్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్‌అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, గాంధీ చౌక్‌ మార్కండేయ కమాన్‌వద్ద సిరిసిల్ల పట్టణకాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సూర దేవ రాజు, తెలంగాణ భవన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీపీఐ జిల్లా కార్యాలయం ఎదుట జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ పట్టణమాజీ అధ్యక్షుడు తీగల శేఖర్‌గౌడ్‌, బీసీభవన్‌ ఎదుట బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రఅధికార ప్రతినిధి పర్శహన్మాం డ్లు, స్థానిక చేనేత విగ్రహం వద్ద సామాజిక సమరసత వేదికజిల్లా కన్వీనర్‌ మోర శ్రీని వాస్‌, జాతీయజెండాను ఎగరవేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్డీవో శ్రీధర్‌బాబు, మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎమ్మార్యో మహేష్‌, సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో డీఎం ప్రకాష్‌రావు, ఎంఆర్‌సీ కార్యాలయం ఎదుట మండల విద్యాధికారి దూస రఘపతి, స్థానిక సుభాష్‌నగర్‌ డేకేర్‌ సెంటర్‌ ఎదుట తెలంగాణ జాతీయ ఆల్‌ సీనియర్స్‌ సిటీజన్స్‌ అసోసియేసన్‌ జిల్లాఅధ్యక్షుడు చేపూరి బుచ్చ య్య జాతీయ పతాకాన్ని ఎగర వేశారు. చేనేత వస్త్రవ్యాపార సంఘం భవనం ఎదుట అధ్యక్షుడు తాటిపాముల దామోదర్‌, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ఎదుట అధ్యక్షుడు రాపెల్లి లక్ష్మి నారాయణ, సిరిసిల్లప్రెస్‌క్లబ్‌ ఎదుట అధ్య క్షుడు ఆకుల జయంత్‌కుమార్‌ జాతీయ జెం డాను ఎగరవేశారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలో కరస్పాం డెంట్లు, ప్రిన్సిపాల్స్‌, ప్రధానోపాఽధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేశారు. కళాశాల, పాఠశాలలఆవరణలో విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషాదారణలతో ఆకట్టుకు న్నారు. కళాశాల, పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగావిద్యార్థులు తమ ఆటాపాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ముఖ్యఅతిథిగా ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, జిల్లా ప్రధాన కార్య దర్శులు రాగుల జగన్‌, వేముల దామోదర్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మహిళజిల్లా అధ్యక్షు రాలు కామునివనిత,తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ : వేములవాడ పట్టణంలో కోర్టులో జడ్జి, రాజన్న ఆలయమైన భీమేశ్వర సదన్‌లో ఈవో రమాదేవి, మున్సిపల్‌ కార్యాల యంలో చైర్మన్‌ పుల్కం రాజు, పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయంలో జయంత్‌ కుమా ర్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ను ఎగరవేయగా అర్బన్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆయాసర్పంచ్‌లు ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో ఘనంగా జాతీయ జెండాను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ జాతీయ జెండాను ఎగరవేశారు.

ఇల్లంతకుంట/గంభీరావుపేట/ముస్తాబాద్‌/వీర్నపల్లి/బోయినపల్లి/కోనరావుపేట/వేములవాడరూరల్‌/చందుర్తి/ఎల్లారెడ్డిపేట/రుద్రంగి : పాఠశాలల్లో,జూనియర్‌ కళాశాలల్లో, మండలపరిషత్‌ కార్యాలయాల్లో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో, సహకార సం ఘాల్లో, పోలీస్‌స్టేషన్‌లలో, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో, కులసంఘాల్లో, మార్కెట్‌ కమిటీ కార్యాలయాల్లో, సెస్‌,యువజన సంఘాల్లో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలల విద్యా ర్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. పాఠశాలల విద్యార్థులు జాతీయ నాయకుల వేశధారణ ఎంతగానో ఆకట్టుకు న్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు వీధులగుండా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు 100 మీటర్ల పొడవైన మూడు రంగుల జెండాను ప్రదర్శించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువ కులు, మహిళలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 12:44 AM