Share News

Rajanna Sircilla: అసంపూర్తిగా దుకాణ సముదాయ భవనం

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:15 AM

చందుర్తి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చందుర్తి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో 10సంవత్స రాల క్రితం శంకు స్థాపన చేసిన దుకాణ సముదాయ భవనం నిర్మాణం పనులు నిధులు లేక అసంపూ ర్తిగా నిలిచిపోయాయి.

 Rajanna Sircilla: అసంపూర్తిగా దుకాణ సముదాయ భవనం

10 సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని భవనం

చందుర్తి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చందుర్తి మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో 10సంవత్స రాల క్రితం శంకు స్థాపన చేసిన దుకాణ సముదాయ భవనం నిర్మాణం పనులు నిధులు లేక అసంపూ ర్తిగా నిలిచిపోయాయి. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో దుకాణ సముదాయ కోసం అప్పటి ఎమ్మెల్సీ టి సంతోష్‌కుమార్‌ సడీపీ నిధుల నుంచి రూ.4లక్షల 99 మంజూరు చేశారు. అప్పటి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు దుకాణ సముదాయ భవననిర్మాణానికి 28అక్టోబర్‌ 2016న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి భవన నిర్మాణం నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ సమ స్యల వల్ల అసంపూర్తిగా నిలిచిపోయింది. ఈ అసంపూర్తి భవన నిర్మాణం నిరు పయోగంగా మారి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. సరైన సమయంలో నిధులు విడుదల కాకపోవడం, విడుదలైనా సరిపోక పోవ డంతో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో భవనం రాత్రి సమయాల్లో అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ప్రభుత్వ ధనం ఖర్చు చేసినా, ఫలితం మాత్రం ప్రజలకు అందడం లేదని గ్రామ యువకులు పేర్కొంటున్నారు. ఆగిపోయిన పనులకు మళ్లీ అంచనాలు వేసి టెండర్‌ ప్రక్రియ పూర్తిచేయాలని, సంబంధిత అధికా రులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:15 AM