Rajanna Sircilla: మార్కెట్‌యార్డు ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ
ABN , Publish Date - Jul 13 , 2026 | 12:03 AM
సిరిసిల్ల అర్బన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రహరీ నిర్మాణానికి ప్రభు త్వం రూ.కోటి30లక్షలు విడు దల చేయడంతో ఆదివారం మార్కెట్ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డి
సిరిసిల్ల అర్బన్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రహరీ నిర్మాణానికి ప్రభు త్వం రూ.కోటి30లక్షలు విడు దల చేయడంతో ఆదివారం మార్కెట్ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూప తిరుపతి రెడ్డితో పాటు పాలకవర్గంతో కలిసి విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజచేశారు. ఈ సంద ర్భంగా ఆదిశ్రీనివాస్ మాట్లా డుతూ రైతులకు మెరుగైన మౌళిక సదుపాయా లను కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గంథ్రాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరదేవరాజు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ నేరేళ్ల నర్సయ్య గౌడ్, డైరెక్టర్‌లు నక్క నర్సయ్య, పోన్నాల పర్శరాములు, ఇటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అనుముల శైలజ, కల్లెపల్లి తిరుపతిరెడ్డి, గుగ్గిళ్ల రాములు, దుబాల వెంకటేశం,గంగు కొండయ్య, ఎండి ఖాజామోయినోద్దీన్, అరెపల్లి బాలచందర్, తదితరులు పాల్గొన్నారు.