Share News

Rajanna Sircilla: బండి సంజయ్‌కు బోయినపల్లి బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:14 AM

బోయినపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్ర జ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజ య్‌కుమార్‌కు బోయినపల్లి మండల బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.

 Rajanna Sircilla:  బండి సంజయ్‌కు బోయినపల్లి బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం

బోయినపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్ర జ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడు బండి సంజ య్‌కుమార్‌కు బోయినపల్లి మండల బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. వేముల వాడకు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో బోయినపల్లి మండలానికి విచ్చేసిన సంద ర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురామ్‌ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై బండి సంజయ్‌ కుమార్‌ను ఆత్మీయంగా స్వాగతిం చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్‌కుమా ర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పేర్కొ న్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, వివిధ గ్రామాల పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 01:14 AM