Share News

Rajanna Sircilla: కార్గిల్‌ అమరవీరులకు ఘన నివాళులు

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:13 AM

సిరిసిల్ల అర్బన్‌, జూలై 26 (ఆంఽధ్రజ్యోతి): కార్గిల్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, కరీం నగర్‌

Rajanna Sircilla: కార్గిల్‌ అమరవీరులకు ఘన నివాళులు

సిరిసిల్ల అర్బన్‌, జూలై 26 (ఆంఽధ్రజ్యోతి): కార్గిల్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీ, కరీం నగర్‌ పార్లమెంటరీ కో-కన్వీనర్‌,మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ అడెపు రవీందర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్గిల్‌ లేక్‌ వద్ద ఆదివారం కార్గిల్‌యుద్ధంలో అమరు లకు జావాన్‌, మాజీ సైనికులతోపాటు ఎన్‌సీసీ విద్యార్థులు, బీజేపీ, సీనియర్‌ సిటిజన్‌లతో కలిసి నివాళ్లు అర్పించారు.

మాజీ సైనికులను ఘనంగా సన్మానిం చారు. అనంతరం ఆడెపు రవీందర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, మాజీ అధ్యక్షుడు నాగులశ్రీనివాస్‌, కౌన్సిలర్‌ ఎర్రం వెంక ట్రాజం, రాష్ట్రకమిటి సభ్యుడు ఎర్రం మహేష్‌, గాజుల వేణు, మహిళా మోర్చా పట్టణ అఽధ్యక్షురాలు, సెన్సార్‌ బోర్డు సభ్యురాలు వేముల వేశాలిసురేష్‌, మోర శ్రీహరి, అంకారపు రాజు, మెర్గుశ్రీనివాస్‌, నవీన్‌యాదవ్‌, చేపూరి అశోక్‌, ఇంజ్జపూరి మురళి తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల టౌన్‌ : కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని కార్గిల్‌లేక్‌ వద్ద బీఆర్‌ఎస్వీ నాయకులు కార్గిల్‌ అమరజవాన్లకు ఘన నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్‌ మాట్లాడుతూ కార్గిల్‌ యుద్ధంలో దేశప్రజల సంరక్షణ కోసం భారతసైన్యం అపారమైన ధైర్యసాహసాలను దేశభక్తిని చాటారని అన్నారు.

వారిపోరాటం దేశభక్తి భారతీయులందరికీ స్పూర్థిదాయకం అన్నారు. దేశసమగ్రత, సార్వభౌమాధి కారాన్ని కాపాడేందుకు వీరజవాన్లు అమరులైనారని దేశ ప్రజలు ఏనాటికి వారి త్యాగాలను మరవలేరన్నారు. కార్యక్రమంలో నాయకులు బక్కని వేణుయాదవ్‌, మల్యాల ప్రవీన్‌, శివ ధనికే రాజు, రాము, నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 12:13 AM