Rajanna Sircilla: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతీఒక్కరు స్మరించుకోవాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:47 AM
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు.
- జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం
సిరిసిల్ల అర్బన్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలని ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్ల జిల్లాపోలీస్ కార్యాలయంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ సమగ్రత ఐక్యతతోపాటు శాంతిభధ్రతలను పరి రక్షించడంలో పోలీస్‌శాఖ కీలకపాత్ర పోషిస్తుం దన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు స్నేహ్నపూర్వక, పారదర్శకమైన పోలీసింగ్ సేవ లను అందించడమే లక్ష్యంగా ప్రతీపోలీస్ అధి కారి పనిచేయాలన్నారు.కార్యక్రమంలో డీఎస్పీలు కత్తురోజు నాగేంద్రచారీ,శ్రీనివాసులు, వెంటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
17వ పోలీస్ బెటాలియన్‌లో..
సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్ 17వ పోలీస్ బెటాలియన్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని బెటాలియన్ కమాండెంట్ పీజేపీసీ ఛటర్జీ ఎగురవేశారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఏఆర్‌ఎస్‌ఐ అనూద్ సింగ్‌కు ఉత్తమసేవ పథకం, ఆర్‌ఐ కె శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐ లు రాజేష్, సురేష్, భరత్, అంజనేయు లుకు సేవాపతకా లను అందజేశారు. పలువురు సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. అనంతరం బెటాలి యన్‌లో నూతనంగా ఏర్పాటు రెనోవేషన్ గార్డ్ రూంను ప్రారంభించారు. కార్యక్రమంలో అసి స్టెంట్ కమాండెంట్‌లు రాజు, సంజీవ్, పోలీస్ అధి కారులు పాల్గొన్నారు.
ప్రజలకు చేరువగా పనిచేయాలి..
ప్రజలసమస్యలను తెలుసుకుని వారికి చేరు వలో మరింతసేవలు అందించి సేవా పతకా లను సాధించుకోవాడానికి పోలీసులు పోటీపడా లని ప్రభుత్వవిప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మకమైన పోలీస్ సేవాపతకాలకు ఎంపి కైన ముస్తాబాద్ హెడ్‌కానిస్టేబుల్ నక్క రాజేం దర్, కమ్యూనికేషన్ ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు, ఇల్లం తకుంట హెడ్‌కానిస్టేబుల్ భూక్యలత, బోయిన్ పల్లి కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు శనివారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బీగీతేలతో కలిసి ప్రభుత్వం ఆదిశ్రీనివాస్ అంద జేసి అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.