Rajanna Sircilla: దీక్షాదివస్‌లో ప్రతీఒక్కరు భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:38 AM
ఇల్లంతకుంట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): దీక్షాదివస్ మహాసభలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావా లని మానకొండూర్ మాజీఎమ్మెల్యే రసమయి బాల కిషన్ అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఇల్లంతకుంట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): దీక్షాదివస్ మహాసభలో ప్రతీఒక్కరు భాగస్వాములు కావా లని మానకొండూర్ మాజీఎమ్మెల్యే రసమయి బాల కిషన్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాల యంలో శనివారం మండలశాఖ అధ్యక్షుడు పల్లెనర్సిం హారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈసంద ర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మాజీసీఎం కేసీ ఆర్ చేపట్టిన దీక్షకు గర్తుగా ఈనెల29న అల్గునూర్ చౌర స్తాలో సమావేశం జరుగు తుందన్నారు. సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరువుతు న్నారని అన్నారు. దీక్షాదివస్ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని తెలంగాణ ఉద్యమ పోరా ట స్ఫూర్తిని చాటాలని కోరారు. సమావేశంలో జడ్పీమాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, మండల శాఖ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్‌డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ చింతపల్లి వేణురావు, చెరుకుపల్లి రాజిరెడ్డి, ఉడుతల వెంకన్న, ఒగ్గు నర్సయ్యయాదవ్ వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
ముస్తాబాద్, (గంభీరావుపేట): దీక్షాదివస్‌ని విజయవంతం చేయాలని మండల బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో వారు మాట్లా డుతూ అలుగునూరు దీక్షా దివస్ సభకు పెద్ద ఎత్తున తరళి వచ్చి విజయవంతం చేయాలన్నారు. కార్యక్ర మంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ముస్తాబాద్ పట్టణ అధ్య క్షుడు ఎద్దంటి నర్సింహరెడ్డి, నాయకులు చెవుల మల్లేశం, కొండ శ్రీనివాస్‌గౌడ్, భరత్, అన్వర్, నర్సింలు, వెంకటేష్, రవి తదితరులు ఉన్నారు.