Share News

Rajanna Sircilla: రైతాంగ పోరాటానికి స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:10 AM

సిరిసిల్ల అర్బన్‌, జూలై 4 (ఆంధ్ర జ్యోతి) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య తాగ్యం నేటితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

Rajanna Sircilla:   రైతాంగ పోరాటానికి స్ఫూర్తి దొడ్డి కొమురయ్య

కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్థంతిలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌, జూలై 4 (ఆంధ్ర జ్యోతి) : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య తాగ్యం నేటితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం బీసీ అభివృద్ధి శాఖ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య పోరాటం తెలంగాణ చరిత్ర లో నిలిచిపోయిందన్నారు. సమాజ అభ్యు న్నతి కోసం నిబద్దతో పనిచేయడమే ఆయనకు నిజ మైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, బీసీ అభివృద్ధిశాఖ అధి కారి సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ స్వప్న, కురుమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ తొలి అమరుడు

దొడ్డి కొమురయ్య

సిరిసిల్ల టౌన్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడిగా చరిత్రలో నిలిచిపోయాడని సీపీఐ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి పంతం రవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రం కార్మిక భవనంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతాంగపోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి ని నిర్వహించారు. ముందుగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నిజాం నవాబ్‌ రజా కర్ల పాలనలో తెలంగాణ భూస్వాములు, దేశ్ముకులు చేస్తున్న ఆగడాలపై ఆంధ్ర మహాసభ నాయకులు ఇచ్చిన పిలుపుతో చైతన్యవంతమైన వరంగల్‌ జిల్లా కడివెండి గ్రామంలో యువకులు శాంతియుంగా సమావేశం నిర్వహిస్తుంటే విసునూరు దేశ్‌ముక్‌ గుండాలు తుపాకులతో విరుచుకపడగా దొడ్డి కొము రయ్య ఆ కాల్పులలో అమరు డయ్యాడని అన్నారు. దొడ్డి కొమురయ్య అమరుడయ్యాక తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం ఉధృతం అయిందని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు సోమ నాగరాజు, ఎలగందుల రాజు, కొంక విజయ్‌, కాడరమేష్‌, సదానందం పాల్గొన్నారు.

ముస్తాబాద్‌ : ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని ప్రధాన కూడలి లోదొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో నాయకులు శీలం స్వామి, కోడె శ్రీనివాస్‌, చెవుల మల్లేశ్‌, మెంగని మనోహర్‌, గూడూ రు భరత్‌, శీలం ప్రశాంత్‌, సుంచు మల్లయ్య, జగ్గ నరేశ్‌, నల్ల నర్సయ్య, బండారి యాదగిరి, గోద మల్లేశ్‌ పుల్లూరి రవి, కంతుల రాజు, కంచంనర్సింలు తదితరులు పాల్గొన్నారు.

తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహం వద్ద స్థానిక సర్పంచ్‌ గాధగోని సాగర్‌, ఉపసర్పంచ్‌ ఆస సందీప్‌ తదితరులు నివాళులర్పించారు.కార్యక్రమంలో మహిళ మండలకాంగ్రెస్‌ అధ్యక్షురాలు ధర్మరెడ్డి హారిక, కాంగ్రె స్‌నాయకులు ఆస రాజేశ్‌, గొల్ల కురుమసంఘం నాయకులు ముద్దాల పర్శరాములు, కృష్ణబాబు, దేవయ్య పాల్గొన్నారు.

వేములవాడ : తెలంగాణ సాయధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని కురుమసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జక్కులతిరుపతి అన్నారు. పట్టణంలోని తెలంగాణచౌక్‌లో పట్టణ అధ్యక్షుడు గుంటి కనుకయ్య ఆధ్వర్యంలో దొడ్డికొమురయ్య చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుంటి కనుకయ్య, జిల్లా కోశాధికారి ఒల్లెం నాగరాజు, నాయకులు మ్యాకల మల్లేశం, ఎను గుల శ్రీనివాస్‌, పర్ష పర్శరాములు, గాజర్ల బుగ్గయ్య, మల్లేశం, సంబు సాగర్‌ తదితరులు ఉన్నారు.

బోయినపల్లి : మండలకేంద్రంలోని బీఆర్‌ఎస్‌పార్టీ కార్యాలయంలో దొడ్డికొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ, సామా జిక న్యాయం, రైతుల హక్కులు, ప్రజాస్వామ్య విలువల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీ యుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

కార్యక్ర మంలో మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, ప్రధానకార్యదర్శి గుంటి శంకర్‌, కొనుకటి నాగయ్య, సర్పంచులు అనుముల భాస్కర్‌, కట్ట గోవర్ధన్‌గౌడ్‌, నిమ్మ శ్రీనివాస్‌ రెడ్డి, జంపుక ఆనంద్‌, కవ్వంపల్లి రాములు, అక్కెనపల్లి కర్ణాకర్‌, మెడుదుల మల్లేశం, కొనుకటి శేఖర్‌, బత్తిని కమల్‌ గౌడ్‌, బోయిని రాజు, కన్నం సాగర్‌, తొంటి మధుకర్‌, గురజాల కోటి, జగన్‌గౌడ్‌, సతీష్‌,దూస మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:10 AM