Share News

రాజన్న సిరిసిల్ల జిల్లా ‘దశాబ్ది’ సంబురం..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:38 AM

రాజన్న సిరిసి ల్ల జిల్లా ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తయిన సందర్భం గా ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నా రు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ‘దశాబ్ది’ సంబురం..

సిరిసిల్ల, అక్టోబరు 11 (ఆంరఽధజ్యోతి): రాజన్న సిరిసి ల్ల జిల్లా ఏర్పాటై దశాబ్ద కాలం పూర్తయిన సందర్భం గా ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు జరుపుకున్నా రు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం, సిరిసిల్ల చేనేత, మరమగ్గాల వస్త్రోత్పత్తి రంగంతో ప్రత్యేకంగా నిలిచిన జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆవి ర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివచ్చారు. సిరి సిల్ల పాత బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. చేనేత విగ్రహానికి పూలమాల లు వేశారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద జిల్లా సాధన ఉద్యమకారులకు సన్మానాలు చేశారు. కలెక్టరే ట్‌ వద్ద బాణాసంచాతో సంబరాలు జరిపారు. సాయం త్రం గాంధీచౌక్‌ నుంచి బతుకమ్మలతో మహిళలు మా నేరు తీరం బతుకమ్మ ఘాటు వద్దకు చేరుకొని బతు కమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కేవలం పరిపాలనా విభజన మాత్రమే కాదని, ఈప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షల కు ప్రతిరూపమన్నారు. తెలంగాణలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే దూరదృష్టితోనే తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా ఏర్పా టు వెనుక ఉన్న ఆలోచనలు, అప్పటి నాయకుల కృషి, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్య మకాలం నుంచే ప్రజలకు చేరువగా పాలన అందించా లనే లక్ష్యంతో కొత్త జిల్లాల అవసరంపై చర్చలు జరిగా యని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్‌తో జిల్లాల ఏర్పాటు, వాటి పరిధు లు, ప్రజలకు పరిపాలనా సేవలను చేరువ చేసే అం శాలపై చర్చలు జరిగాయన్నారు.సిరిసిల్లలో కొంతమం ది కరీంనగర్‌తోనే ఉంటామని అన్నారని గుర్తు చేశారు. గతంలో సిరిసిల్ల ప్రాంత ప్రజలు అనేక ప్రభుత్వ పను ల కోసం కరీంనగర్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందు లను తగ్గించి స్థానికంగానే ప్రభుత్వ సేవలు అందుబా టులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా ఏర్పాటు జరి గిందని వివరించారు. నాడు రాష్ట్ర మంత్రిగా ఉన్న కేటీ ఆర్‌ జిల్లా ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించడ మే కాకుండా, రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ కాలేజీ, వ్యవసాయ కళాశాల, వ్యవసా య పాలిటెక్నిక్‌ కళాశాల, నూతన కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయం, గ్రంథాలయం ఏర్పాటువంటి కీలక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అలాగే సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌, చీర్లవంచలో ఆక్వా పరిశ్రమ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ ఏర్పాటుకు కృషి చేశారు.అదేవిధంగా, అప్పటి వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమే ష్‌బాబు జిల్లాకు ‘రాజన్న జిల్లా’గా పేరు పెట్టాలని సూచించారని, కేటీఆర్‌ సిరిసిల్ల పేరును చేర్చి రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేశారన్నారు. జిల్లా అభివృద్ధి జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలు, వెనుకబడిన ప్రాంతాలకూ చేరాలన్నారు. జిల్లా ఏర్పాటు ద్వారా చేరువైనా పరిపాలనా వ్యవస్థను మరింత ప్రజోపయోగకరంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి కార్యక్రమాలను నిరం తరం కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య సంస్థలు, అభివృద్ధి ప్రణాళికలకు ప్రాధాన్యత కొనసాగాలన్నారు. భవిష్యత్తులో జిల్లాను మరింత అభి వృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతిని ధులు, రైతులు, యువత, ఉద్యోగులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా కృషి చేయాలని పిలు పునిచ్చారు.2009లో ‘ఆంధ్రజ్యోతి’లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు.. కొత్త జిల్లాలు ఏర్పడాలని వ్యాసం రాశారన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిరిసిల్ల జిల్లా లో 8వేల ఎకరాలు కేసీఆర్‌ అందరికీ పంచారని, 2400 ఎకరాలు కలెక్టర్‌ తిరిగి తీసుకున్నారు అని చెప్పడం జరిగిందన్నారు.. వాటి లెక్క తేల్చాలని ఆర్టీఐ కింద కలెక్టర్‌ కోరామన్నారు. భూముల లెక్కలు చెప్పకుంటే స్పీకర్‌ దగ్గర పిటిషన్‌ వేసి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డులోంచి తొలగించే విధంగా డిమాండ్‌ చేస్తామన్నారు. రేవంత్‌ రెడ్డి వచ్చిన కొత్తలో కొన్ని జిల్లాలను తీసేస్తా అనడంతో సిరిసిల్ల ఉంటుం దా పోతుందా అని కొందరు అడిగితే ఎక్కడికి పోదు అని చెప్పానన్నారు. అమెరికాలో దొరికే జీన్స్‌ ప్యాంట్లు, బట్టలు బంగ్లాదేశ్‌, శ్రీలంకలో తయారవుతాయని, అలాంటి బట్టలు సిరిసిల్ల లో ఉత్పత్తి అయ్యేవిధంగా, పద్మశాలి సామా జిక వర్గానికి ఉపాధి లభించే విధంగా ఆపెర ల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లడం లేదని అన్నారు. ఆపెరల్‌ పార్క్‌ ముందుకు తీసుకొని వెళ్లడంలో ఆందోళన చే స్తామని హెచ్చరించారు.

చేరువైన పరిపాలన..అభివృద్ధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పరిపా లన చేరువ కావడమే కాకుండా అభివృద్ధివైపు అడుగు లు వేసామని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌, చ ల్మెడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో వారు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీ ఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు కే తారకరామా రావు చేసిన కృషిని గుర్తు చేశారు. జిల్లా ఏర్పడడంతో మెడికల్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజ్‌, నర్సింగ్‌ కాలేజ్‌, వ్యవసాయ కళాశాలలే కాకుండా నేత కార్మికులకు ఉపాధి ఇలా అనేక కార్యక్రమాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి, వైస్‌ చైర్మన్‌ దార్ల సందీప్‌, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి,జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్లు తుల ఉమ, అరుణ, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అవునూరి రమాకాంత్‌రావు, టెక్స్‌ టైల్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు బొల్లి రామ్మోహన్‌, దిడ్డి శ్రీనివాస్‌, ఎండీ సత్తార్‌, మనో హర్‌రెడ్డి, సిద్దం వేణు, కుంబాల మల్లారెడ్డి, గడ్డం నాగ రాజు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 12 , 2026 | 12:38 AM